Supreme Court : ‘శివలింగం’ కార్బన్ డేటింగ్‌ ఆదేశాలను నిలిపేసిన సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2023-05-19T15:58:36+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ‘శివలింగం’ వయసును శాస్త్రీయంగా నిర్ణయించాలని,

Supreme Court : ‘శివలింగం’ కార్బన్ డేటింగ్‌ ఆదేశాలను నిలిపేసిన సుప్రీంకోర్టు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ‘శివలింగం’ వయసును శాస్త్రీయంగా నిర్ణయించాలని, కార్బన్ డేటింగ్ వంటి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం నిలిపేసింది. గత ఏడాది నిర్వహించిన వీడియోగ్రాఫిక్ సర్వేలో ఈ ‘శివలింగం’ కనిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇది ఫౌంటెన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది.

జ్ఞానవాపి మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. ‘శివలింగం’ వయసును నిర్థరించేందుకు కార్బన్ డేటింగ్ నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పర్యవసానాలనుబట్టి చూసినపుడు, దీనిపై మరింత లోతుగా పరిశీలించవలసిన అవసరం ఉందని తెలిపింది. హైకోర్టు ఆదేశాలు తదుపరి విచారణ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

వారణాసిలోని కాశీ విశ్వనాధుని దేవాలయం పక్కనే జ్ఞానవాపి మసీదు ఉంది.

ఇవి కూడా చదవండి :

UK parliament : బ్రిటన్ పార్లమెంటు భవనం కూలిపోబోతోందా?

Kozhikode train arson case: నిందితుడి అరెస్ట్ సమాచారాన్ని లీక్ చేసిన ఐపీఎస్ అధికారి సస్పెన్షన్

Updated Date - 2023-05-19T15:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising