ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yogi Adityanath : హైకోర్టు ఇచ్చిన ఝలక్‌‌పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అపీలు విచారణ 4న : సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2023-01-03T15:07:39+05:30

ఇతర వెనుకబడిన తరగతులు (OBCs)కు పురపాలక సంఘాల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం ఉత్తర ప్రదేశ్

Supreme Court
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఇతర వెనుకబడిన తరగతులు (OBCs)కు పురపాలక సంఘాల ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వ వాదనపై జనవరి 4న విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు (Supreme Court) అంగీకరించింది. ఓబీసీలకు ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్‌ను రద్దు చేసి, రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలను నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అపీలు చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ అపీలుపై అత్యవసర విచారణ జరపవలసిన అవసరం ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ వాదనను ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం అంగీకరించింది. జనవరి 4న విచారణ జరుపుతామని చెప్పింది.

పురపాలక సంఘాల ఎన్నికల్లో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ డిసెంబరు 5న ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నోటిఫికేషన్‌ను డిసెంబరు 27న అలహాబాద్ హైకోర్టు రద్దు చేసినట్లు తెలిపింది. ఓబీసీలకు రాజ్యాంగ రక్షణ ఉందని, ఈ నోటిఫికేషన్‌ను రద్దు చేయడం ద్వారా హైకోర్టు తప్పు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ ఆన్ రికార్డ్ రుచిర గోయల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

Updated Date - 2023-01-03T15:07:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising