ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sengol : ఆధీనమ్‌ల ఆశీర్వాదాలతో రాజదండాన్ని స్వీకరించిన మోదీ

ABN, First Publish Date - 2023-05-27T21:08:49+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం తమిళనాడు నుంచి వచ్చిన ఆధీనమ్‌ల (మఠాధిపతులు) నుంచి అత్యంత పవిత్రమైన రాజదండాన్ని స్వీకరించారు.

Narendra Modi
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం తమిళనాడు నుంచి వచ్చిన ఆధీనమ్‌ల (మఠాధిపతులు) నుంచి అత్యంత పవిత్రమైన రాజదండాన్ని స్వీకరించారు. దీనిని నూతన పార్లమెంటు భవనంలో ఆదివారం ప్రతిష్ఠిస్తారు. మోదీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆధీనమ్‌లు ఆయనను ఆశీర్వదించి, ఈ రాజదండాన్ని ఆయనకు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

తమిళనాడులోని ధర్మపురం, పళని, విరుధాచలం, తిరుకోయిలూర్, తిరువవడుతురైల నుంచి దాదాపు 21 మంది మఠాధిపతులు (ఆధీనమ్‌లు) శనివారం న్యూఢిల్లీకి వచ్చారు. వీరు మోదీ నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయనను ఆశీర్వదించి, సెంగోల్ (రాజదండం)ను అందజేశారు. దీనిని నూతన పార్లమెంటు భవనంలో లోక్‌సభ సభాపతి ఆసనం వద్ద ప్రతిష్ఠిస్తారు.

బ్రిటిషర్ల నుంచి భారత దేశానికి అధికార మార్పిడికి చిహ్నం ఈ రాజదండం (సెంగోల్) అని కేంద్ర మంత్రి అమిత్ షా చెప్పిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయి, 100 సంవత్సరాలు పూర్తి చేసుకునేందుకు పరుగులు తీస్తున్న అమృతకాలంలో దీనిని జాతీయ చిహ్నంగా చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు.

ఈ రాజదండం ధర్మబద్ధ, న్యాయ పాలనకు చిహ్నం. తిరువవడుతురై ఆధీనానికి చెందిన అంబలవన దేసిగ పరమాచార్య స్వామిగళ్ శుక్రవారం మాట్లాడుతూ, సెంగోల్‌కు సముచిత ప్రాధాన్యం ఇస్తుండటం తమిళనాడుకు గర్వకారణమని చెప్పారు. 1947లో లార్డ్ మౌంట్‌బాటన్ ఈ సెంగోల్‌ను జవహర్లాల్ నెహ్రూకు అందజేశారన్నారు. తాము దీనిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అందజేస్తామన్నారు. దీనిని పార్లమెంటులో ప్రతిష్ఠించాలని మోదీ నిర్ణయించడం హర్షణీయమని, గర్వకారణమని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Ghaziabad: ఫుడ్ ప్యాకెట్‌లో ఉమ్మి వేసిన రెస్టారెంట్ ఉద్యోగి

Delhi University : ‘సారే జహా సే అచ్ఛా’ రచయిత ఇక్బాల్‌పై పాఠం సిలబస్ నుంచి తొలగింపు

Updated Date - 2023-05-27T21:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising