DMK : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిది : తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్
ABN, First Publish Date - 2023-09-03T09:41:34+05:30
సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, దీనిని కేవలం వ్యతిరేకించడం కాకుండా పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇది సాంఘిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చెన్నై : సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ వంటిదని, దీనిని కేవలం వ్యతిరేకించడం కాకుండా పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ అన్నారు. ఇది సాంఘిక న్యాయానికి, సమానత్వానికి వ్యతిరేకమని తెలిపారు. సనాతన ధర్మ నిర్మూలన సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘కొన్నిటిని కేవలం వ్యతిరేకించకూడదు, పూర్తిగా నిర్మూలించాలి. మనం డెంగ్యూను, దోమలను, మలేరియాను లేదా కరోనాను వ్యతిరేకించలేం. మనం వీటిని నిర్మూలించాలి. అలాగే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి’’ అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి అన్నారని ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
ఉదయనిధి తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాభివృద్ధి శాఖల మంత్రిగా పని చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడం కాకుండా దానిని పూర్తిగా నిర్మూలించాలని ఆయన చెప్పారు. సనాతన అంటే సంస్కృతం నుంచి వచ్చిందని, ఇది సాంఘిక న్యాయం, సమానత్వాలకు వ్యతిరేకమని చెప్పారు.
ఈ నేపథ్యంలో బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, సనాతన ధర్మాన్ని తమిళనాడు మంత్రి ఉదయనిధి మలేరియా, డెంగ్యూలతో పోల్చుతున్నారన్నారు. దీనిని వ్యతిరేకించడం కాకుండా సమూలంగా నిర్మూలించాలని అభిప్రాయపడుతున్నారన్నారు. క్లుప్తంగా చెప్పాలంటే సనాతన ధర్మాన్ని పాటించేవారు జనాభాలో 80 శాతం మంది ఉన్నారని, వారిని సామూహికంగా హత్య చేయాలని ఆయన అభిప్రాయపడుతున్నారని అన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలో డీఎంకే ముఖ్యమైన సభ్యురాలని, కాంగ్రెస్‌తో ఆ పార్టీకి సుదీర్ఘకాలం నుంచి మైత్రి ఉందని తెలిపారు. ముంబైలో జరిగిన ఇండియా కూటమి సమావేశాల్లో దీనిపైనే అంగీకారం కుదిరిందా? అని ప్రశ్నించారు.
అమిత్ మాలవీయ ట్వీట్‌పై ఉదయనిధి స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, తాను తన మాటలకు కట్టుబడి ఉన్నానని, అయితే సనాతన ధర్మాన్ని పాటించేవారిని చంపాలని తాను అనలేదని అన్నారు. సనాతన ధర్మం వల్ల బాధితులైన అణగారిన వర్గాలవారి తరపున తాను మాట్లాడానని చెప్పారు. ఎటువంటి సవాలునైనా ఎదుర్కొనడానికి తాను సిద్ధమేనని చెప్పారు.
ప్రతిపక్ష ఇండియా కూటమిలో డీఎంకే భాగస్వామి అనే సంగతి తెలిసిందే. గురు, శుక్రవారాల్లో ముంబైలో ఈ పార్టీల సమావేశం జరిగింది.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi: దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డివిరిచిన బీజేపీ: రాహుల్
Rajasthan horror: మహిళను వివస్త్రను చేసి గ్రామంలో తిప్పారు.. వీడియో వైరల్
Updated Date - 2023-09-03T10:38:33+05:30 IST