ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Temperature: వర్షాకాలంలో... వేడి సెగలు

ABN, First Publish Date - 2023-08-17T10:33:22+05:30

రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఎండల తీవ్రత అధికమై వేడి సెగలు పుట్టిస్తోంది. వర్షాకాలంలో ఈ తరహా అనూహ్య వాతావరణం మధ్య జనం ఉక్కిరి

- జనం ఉక్కిరి బిక్కిరి

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులుగా ఎండల తీవ్రత అధికమై వేడి సెగలు పుట్టిస్తోంది. వర్షాకాలంలో ఈ తరహా అనూహ్య వాతావరణం మధ్య జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గరిష్ట ఉష్ణోగ్రత(temperature) 30 డిగ్రీలకు పైగానే ఉంటోంది. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడి చురుక్కుమనిపిస్తోంది. రాజధాని బెంగళూరు నగరంలో మధ్యాహ్నం వరకు ఎండ ఉంటున్నా సాయంత్రం నాటికి ఓ మాదిరి వర్షం పడుతోంది. రాష్ట్రంలోని కోస్తా, మలెనాడు, పశ్చిమకనుల ప్రాంతంలోనూ ఇదే తరహా వాతావరణం నెలకొని ఉంది. ప్రస్తుత సీజన్‌లో వర్షపాతం కొరత దక్షిణ కన్నడ జిల్లాలో 24 శాతంగానూ, ఉడుపిలో 19 శాతంగానూ, ఉత్తర కన్నడ జిల్లాలో 8 శాతంగానూ ఉందని రాష్ట్రం మొత్తం మీద 14 శాతం మేరకు వర్షపాతం కొరత ఏర్పడిందని వాతావరణ శాఖ ఉన్నతాధికారి ఒకరు బుధవారం మీడియాకు చెప్పారు. వాతావరణంలో నెలకొన్న విపరీత పరిణామాలే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు. వర్షాకాలమైనా రాష్ట్రమంతా దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఎండ వేడిమి నెలకొని ఉంది. కాగా సిద్దరామయ్య పాలన ప్రారంభం కాగానే వర్షాలు మాయమై రాష్ట్రం కరువు దిశగా సాగుతోందని బీజేపీ ఎద్దేవా చేస్తూ బుధవారం ట్వీట్‌ చేసింది. అయితే బీజేపీ పాలనలోనే అత్యధిక కరువు నమోదైందంటూ కాంగ్రెస్‌ ఈ ఆరోపణలను తిప్పికొడుతూ ట్వీట్‌ చేసింది.

Updated Date - 2023-08-17T10:33:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising