ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Temperatures: 4 నుంచి అగ్ని నక్షత్రం..

ABN, First Publish Date - 2023-05-02T09:26:22+05:30

ఈ ఏడాది వేసవి సీజన్‌ ప్రారంభానికి ముందునుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంది. గత నెలలోనే పలు జిల్లాల్లో అత్యధికంగా 40 డిగ్రీల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇప్పటికే పలు జిలాల్లో 37 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

పెరంబూర్‌(చెన్నై): ఈ ఏడాది వేసవి సీజన్‌ ప్రారంభానికి ముందునుంచే ఎండ తీవ్రత అధికంగా ఉంది. గత నెలలోనే పలు జిల్లాల్లో అత్యధికంగా 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చెన్నై, మదురై, తిరుచ్చి, వేలూరు, కరూర్‌(Chennai, Madurai, Trichy, Vellore, Karur) సహా పలు నగరాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండగా, కడలూరు, తంజావూరు సహా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, అగ్ని నక్షత్రం (రోహిణి కార్తె) ఈ నెల 4న ప్రారంభమై 25 రోజులు (28వ తేది) వరకు కొనసాగనుంది. ఈ కారణంగా ఎండ తీవ్రత 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశముంది. అలాగే, గాలిలో తేమ శాతం తగ్గి ఉక్కపోత నెలకొనే పరిస్థితులున్నాయి. ఆ రోజుల్లో పగటి, రాత్రి సమయాల్లో వడగాలులు వీస్తాయి. ఈ కార్తెలో 11 వ తేదీ నుంచి 24 వరకు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశముందని, ప్రజలు సాధ్యమైనంత వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ తదితరాలు సేవించాలని సూచిస్తున్నారు.

Updated Date - 2023-05-02T09:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising