ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Emergency Alert: మీకు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ వచ్చిందా? దీని వెనుక అసలు కారణం ఇదే!

ABN, First Publish Date - 2023-08-17T17:25:31+05:30

గురువారం మధ్యాహ్నం సమయంలో కొంతమంది మొబైల్ యూజర్లు ‘ఎమర్జెన్సీ అలర్ట్’ అనే ఒక మెసేజ్ వచ్చింది. బీప్ సౌండ్‌తో ఫ్లాష్ మెసేజ్ పేరిట వచ్చిన ఈ సందేశం చూసి..

గురువారం మధ్యాహ్నం సమయంలో కొంతమంది మొబైల్ యూజర్లు ‘ఎమర్జెన్సీ అలర్ట్’ అనే ఒక మెసేజ్ వచ్చింది. బీప్ సౌండ్‌తో ఫ్లాష్ మెసేజ్ పేరిట వచ్చిన ఈ సందేశం చూసి.. చాలామంది గందరగోళానికి గురయ్యారు. ఎమర్జెన్సీ అలర్ట్ ఉండటంతో.. ఏమైనా తేడా జరిగిందా? ఉన్నట్లుండి ఈ మెసేజ్ ఎందుకొచ్చింది? అసలేం జరుగుతోంది? అంటూ అయోమయం చెందారు. అయితే.. ఈ మెసేజ్ చూసి అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఇదేమీ సైబర్ నేరగాళ్లు పంపిన మెసేజ్ కాదు, ఎమర్జెన్సీ అలర్ట్ సిస్టమ్ టెస్టింగ్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వమే దీనిని పంపించింది. విపత్తుల సమయంలో ప్రజల్ని అప్రమత్తం చేసేందుకు గాను.. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి కేంద్రం ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థను రూపొందించింది. ఈ క్రమంలోనే దీన్ని పరీక్షించగా.. దేశవ్యాప్తంగా కొంతమంది యూజర్లకు పెద్ద సౌండ్‌తో ఈ ఫ్లాష్‌ మెసేజ్‌ వచ్చింది.


అసలు ఈ సందేశంలో ఏముందంటే.. ‘‘ఇది టెలికమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన సెల్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ సిస్టమ్ పంపించిన ఓ శాంపిల్ టెస్టింగ్ మెసేజ్. దీనిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ రూపొందించిన పాన్‌-ఇండియా ఎమర్జెన్సీ అలర్ట్‌ సిస్టమ్‌ను పరీక్షించేందుకు ఈ మెసేజ్‌ను పంపించడం జరిగింది. అత్యవసరమైన సమయాల్లో (భూకంపాలు, సునామీ, తుఫాన్) ప్రజల్ని వెంటనే అప్రమత్తం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇది ప్రజా భద్రతను మెరుగుపరుస్తుంది’’ అని పేర్కొని ఉంది. గురువారం మధ్యా్హ్నం 1:35 గంటల సమయంలో ఈ ఫ్లాష్ మెసేజ్ కొందరు యూజర్లకు వచ్చింది. ఈ మెసేజ్ రాగానే కొందరు ఆందోళనలకు గురై.. ఇంటర్నెట్‌లో ఫోటోలను షేర్ చేశారు. అయితే.. ఇలాంటి మెసేజ్ యూజర్లకు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో జులై 20వ తేదీన కూడా కొంతమంది యూజర్లకు ఇలాంటిదే ఒక ఫ్లాష్ మెసేజ్ వచ్చింది.

Updated Date - 2023-08-17T17:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising