Chandrayaan-3: నెహ్రూజీ కలల సాకారమే చంద్రయాన్-3 విజయం: రాహుల్
ABN, First Publish Date - 2023-08-23T20:42:48+05:30
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నెహ్రూజీకి ఉన్న శాస్త్రీయ దృక్కోణమే భారత పరిశోధనా సంస్థకు పునాది వేసిందని అన్నారు. ఇందుకోసం తొలినాళ్ల నుంచి చేసిన కృషి ఫలితమే ఈరోజు చంద్రయాన్-3 విజయమని ఆయన ట్వీట్ చేశారు.
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 (Chandrayaan-3) విజయవంతం కావడంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) హర్షం వ్యక్తం చేశారు. చంద్రుని విజయయాత్ర వెనుక తొలినాళ్ల నుంచి చేసిన గర్వించదగిన కృషి, దృఢదీక్ష, విజన్ ఉందని అన్నారు. స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ (Pandit Jawaharlal Nehru)కు ఉన్న శాస్త్రీయ దృక్కోణమే భారత పరిశోధనా సంస్థకు పునాది వేసిందని అన్నారు. ఇందుకోసం తొలినాళ్ల నుంచి చేసిన కృషి ఫలితమే ఈరోజు చంద్రయాన్-3 విజయమని ఆయన ట్వీట్ చేశారు.
నెహ్రూజీ కన్న కలలకు సాకారంగానే అంతరక్ష రంగంలో భారత్ వెలుగులీనుతోందనే శీర్షికతో నాటి కృషిని వివరించే ఫోటోను తన ట్వీట్‌కు రాహుల్ జోడించారు. ఐస్రో (Orginally INCOSPAR)ను 1962లో పండిట్ జహహర్ లాల్ నెహ్రూ స్థాపిxచారని, ఆర్యభట్ ఉపగ్రహాన్ని 1975 ఏప్రిల్ 19న ప్రయోగించారని, 1984లో రాకేష్ శర్మ అంతరిక్షలో అడుగుపెట్టిన తొలి భారతీయుడని, 2008 అక్టోబర్ 1న చంద్రయాన్-1 లాంఛ్ అయ్యిందని, మార్స్ ఆర్బిటర్ మిషన్ అయిన మంగళ్‌యాన్ మిషన్ 2013 నవంబర్ 1న లాంఛ్ అయ్యిందని ఆ ట్వీట్‌లో రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Updated Date - 2023-08-23T20:42:48+05:30 IST