ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hamas Israel conflict : ఐరాస క్యాంపస్‌ లూటీ... మార్చురీలో స్థలం లేక..

ABN, First Publish Date - 2023-10-17T02:53:28+05:30

గాజాలోని ఐక్య రాజ్య సమితి(ఐరాస) క్యాంప్‌సను హమాస్‌ ఉగ్రవాదులు లూటీ చేశారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యకర్తల ముసుగులో యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌

గాజాలో హమాస్‌ ఘాతుకం

ఇంధనం, డబ్బు, ఔషధాల తస్కరణ

గాజాపై ఉధృతమవుతున్న దాడులు

ఇరువైపులా 4 వేలకు పైగా మరణాలు

మార్చురీల్లో స్థలం లేక..

ఐస్‌క్రీం వాహనాల్లో మృతదేహాలు

క్షేత్రస్థాయి దాడులకు సిద్ధమైన ఐడీఎఫ్‌

ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన ఇరాన్‌

దక్షిణ గాజాకు 10 లక్షల మంది ఆస్పత్రుల్లో వైద్యుల కొరత

జెరూసలేం, అక్టోబరు 16: గాజాలోని ఐక్య రాజ్య సమితి(ఐరాస) క్యాంప్‌సను హమాస్‌ ఉగ్రవాదులు లూటీ చేశారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యకర్తల ముసుగులో యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ(యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ) ప్రాంగణంలోకి చొరబడ్డ హమాస్‌ మూకలు.. ఇంధనం, ఔషధాలు, ఆహారం, దుస్తులు, డబ్బును తస్కరించారు. ఈ విషయాన్ని గాజాలోని యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ అధికారులు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తర, మధ్య గాజా నుంచి సుమారు 10 లక్షల మంది పౌరులు సోమవారం దక్షిణ గాజాకు చేరుకున్నారు. వారిలో వైద్యులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారని, దీంతో ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయమేర్పడుతోందని ఐరాస వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇజ్రాయెల్‌ దాడుల్లో గాజావ్యాప్తంగా 2,750 మంది చనిపోయారని, 9,700 మంది గాయపడ్డారని పేర్కొన్నాయి. అటు ఇజ్రాయెల్‌లోనూ మరణాల సంఖ్య 1,400కు పైగా ఉందని.. ఇరువైపులా మరణాలు 4 వేలను దాటాయని వెల్లడించాయి. గాజాలోని ఆస్పత్రుల్లో మార్చురీలు నిండిపోవడంతో.. మృతదేహాలను ఐస్‌క్రీమ్‌ వ్యాన్‌లలో భద్రపరుస్తున్నట్లు గాజా వర్గాలు ఆదివారం వాగ్నర్‌ సేనల టెలిగ్రామ్‌ చానల్‌లో విడుదల చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సుమారు 10 లక్షల మంది పౌరులు దక్షిణ గాజాకు చేరుకోవడంతో.. ఇజ్రాయెల్‌ సర్కారు ఆ ప్రాంతానికి తాగునీటి సరఫరాను పునరుద్ధరించింది. గాజాలో సాధారణ పౌరుల్లో చాలా మంది గాజా దక్షిణ ప్రాంతానికి చేరుకోవడంతో.. పదాతి దళాలతో ఆక్రమణకు సిద్ధమైనట్లు ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) ప్రకటించింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యమని, హమా్‌సల ఏరివేతకు బ్లూప్రింట్‌ను సిద్ధం చేశామని పేర్కొంది. ఇప్పటికే 3.6 లక్షల సేనలను ఇజ్రాయెల్‌ గాజా సరిహద్దుల్లో మోహరించింది. సోమవారం ఇజ్రాయెల్‌ దాడుల్లో హమాస్‌కు చెందిన దక్షిణ గాజా కమాండర్‌ హతమయ్యారు.


ఇరాన్‌ వార్నింగ్‌.. ఇజ్రాయెల్‌ కౌంటర్‌

గాజా, లెబనాన్‌పై దాడుల విషయంలో ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గాలని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నసీర్‌ కనానీ సోమవారం అన్నారు. హమాస్‌ ఉగ్రవాదుల చెరలో ఉన్న 200 మంది బందీలను విడిపించేందుకు తాము సిద్ధమని, అయితే.. గాజాపై ఏరియల్‌ స్ట్రైక్స్‌ను ఆపేయాలని సూచించారు. .ఇరాన్‌ వ్యాఖ్యలపై హమాస్‌ సంస్థ తరఫున ఎలాంటి సమ్మతి రాలేదు. కానీ, ఇజ్రాయెల్‌ జైళ్లలోని తమవారిని విడుదల చేస్తే.. బందీలను అప్పగిస్తామని హమాస్‌ వర్గాలు పేర్కొన్నాయి. తొలుత ఇరువైపులా కాల్పుల విరమణ జరగాలన్నాయి. ఈ పరిణామాలపై ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు సీరియ్‌సగా స్పందించారు. హమాస్‌, హిజ్బుల్లా ఉగ్ర సంస్థలు, ఇరాన్‌ తమను పరీక్షించొద్దని హెచ్చరించారు.

గాజా ఆక్రమణ పెద్ద తప్పిదం అవుతుంది

గాజాను తన ఆక్రమణలో ఉంచుకోవాలని ఇజ్రాయెల్‌ అనుకుంటే పెద్ద తప్పిదం అవుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ దళాలు గాజాను చుట్టుముట్టిన నేపథ్యంలో బైడెన్‌ ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ యుద్ధ నియమాలను పాటిస్తుందని భావిస్తున్నానని, గాజాలో అమాయక పౌరులకు నీరు, ఆహారం, ఔషధాలు అందేట్లు చూడాలని సూచించారు. ఇజ్రాయెల్‌ గాజాను సుదీర్ఘకాలం తన ఆధీనంలో ఉంచుకోకూడదని, అక్కడ పాలస్తీనీయుల పరిపాలన ఉండి తీరాలన్నారు. అయితే గాజాలోకి వెళ్లి ఉగ్రవాదులను ఏరివేయడం తప్పక జరగాలన్నారు. కాగా, బైడెన్‌ ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లాలా.. వద్దా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి తెలిపారు.

Updated Date - 2023-10-17T07:47:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising