ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

HD kumaraswamy: ఇది నాకు మూడో పునర్జన...ఆసుపత్రి నుంచి కుమారస్వామి డిశ్చార్జి

ABN, First Publish Date - 2023-09-03T21:17:08+05:30

తీవ్ర జ్వరం, మైల్డ్ స్ట్రోక్‌తో ఆగస్టు 30వ తేదీ ఉదయం అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి లుకున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం ఆయన డిశ్చార్చ్ అయ్యారు. ఇది తన మూడో పునర్జన్మగా భావిస్తున్నట్టు చెప్పారు.

బెంగళూరు: తీవ్ర జ్వరం, మైల్డ్ స్ట్రోక్‌తో ఆగస్టు 30వ తేదీ ఉదయం అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి (HD Kumaraswamy) కోలుకున్నారు. దీంతో ఆదివారం సాయంత్రం ఆయన డిశ్చార్చ్ అయ్యారు. ఇది తనకు మూడో పునర్జన్మ అని, తనకు కొత్త జీవితాన్ని ప్రసాదించిన వైద్యుల బృందానికి కృతజ్ఞతలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.


''ఒక వ్యక్తికి ఒక జన్మ ఉంటుంది. 64 ఏళ్ల వయస్సులో నాకు ఇది మూడో జన్మగా భావిస్తున్నారు. ఆ భగవంతుడికి, నేను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను'' అని కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అర్ధరాత్రి సమయంలో తనకు పక్షవాత లక్షణాలు కనిపించడంతో వెంటనే వైద్యులను సంప్రదించి ఆసుపత్రిలో చేరానని, వైద్యుల పర్యవేక్షణలతో పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని, స్ట్రోక్ వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. డబ్బు కోసమే వైద్యులు పనిచేస్తారని చాలామంది తప్పుపడుతుంటారని, కానీ అది నిజం కాదని చెప్పారు. పేషెంట్ల ఆరోగ్యం గురించి వైద్యులు ఎంతో తపన పడుతుంటారని చెప్పారు.

Updated Date - 2023-09-03T21:17:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising