Viral News: ఇండియాలో హ్యాపీయెస్ట్ రాష్ట్రం ఏదో తెలుసా ?
ABN, First Publish Date - 2023-04-19T18:15:01+05:30
కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, COVID-19 ప్రభావం, శారీరక,మానసిక ఆరోగ్యంతో సహా ఆరు అంశాలపై పరిశోధనల ఆధారంగా మిజోరం ఆనంద సూచికలో మొదటిస్థానంలో ఉన్నట్లు ..
మన దేశంలో అత్యంత సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా? ఈశాన్య రాష్ట్రమైన మిజోరం (Mizoram) భారతదేశంలో హ్యాపీయెస్ట్ స్టేట్(India's Happiest State)గా తాజా అధ్యయనంలో తేలింది. గురుగ్రామ్‌లోని మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్ (Management Development Institute in Gurugram)లో స్ట్రాటజీ ప్రొఫెసర్ రాజేష్ కె పిలానియా(Rajesh K Pillania) ప్రధానంగా ఆరు అంశాలపై జరిపిన పరిశోధనల ఆధారంగా మిజోరాం అత్యంత హ్యాపీయెస్ట్ స్టేట్‌గా గుర్తించబడింది.
ఫ్రొఫెసర్ పిలానియా నివేదిక ప్రకారం, 100 శాతం అక్షరాస్యత(100 per Cent Literacy) సాధించిన రాష్ట్రాల్లో మిజోరాం(Mizoram) రెండో స్థానం(2nd Place)లో ఉంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా విద్యార్థుల విద్య, అభివృద్ధికి ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని అధ్యయనంలో తెలిసింది. అంతేకాదు కుటుంబ సంబంధాలు, పని సంబంధిత సమస్యలు, సామాజిక సమస్యలు, దాతృత్వం, మతం, COVID-19 ప్రభావం, శారీరక,మానసిక ఆరోగ్యంతో సహా ఆరు అంశాలపై పరిశోధనల ఆధారంగా మిజోరం ఆనంద సూచికలో మొదటిస్థానంలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
మిజోరాంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని చిన్నతనంలోనే తన తండ్రి వదిలిపెట్టి వెళ్లడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. చదువులో రాణిస్తున్న ఆ విద్యార్థి తాను చార్టర్డ్ అకౌంటెంట్ అవుతానని లేదా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు రాస్తానని చెప్పాడు. అదేవిధంగా, GMHSలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి, నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)లో చేరతానని చెప్పాడు. అతని తండ్రి పాలఫ్యాక్టరీలో వర్కర్. తల్లి గృహిణి. ఈ ఇద్దరి విద్యార్థుల్లో అంతటి ఆత్మవిశ్వాసానికి కారణం అక్కడి వాతావరణం, సదుపాయాలు, అనుకూలతల ప్రభావం చూపుతున్నాయని నివేదిక పేర్కొంది.
ఇక్కడ మాకు "మా ఉపాధ్యాయులు మాకు మంచి స్నేహితులు. ఎటువంటి సిగ్గూ, బిడియం లేకుండా మా టీచర్లతో కలిసి పోయి వారితో ఏదైనా పంచుకుంటామని’’ అని ఒక విద్యార్థి చెప్పాడు. ఉపాధ్యాయులు కూడా క్రమతప్పకుండా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సమావేశం అవుతుంటారు. వారు ఎదుర్కొంటున్న ఏవైనా సమస్యలను పరిష్కార మార్గాలు చూపుతారు.
మిజోరాంలో సామాజిక నిర్మాణం కూడా అక్కడి యువత ఆనందానికి దోహదం చేస్తుంది. తమ "పెంపకంలో యువత సంతోషంగా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేస్తుంది. ‘‘మాది కుల రహిత సమాజం. అలాగే ఇక్కడ చదువుల కోసం తల్లిదండ్రుల ఒత్తిడి చాలా తక్కువ" అని ప్రైవేట్ స్కూల్ టీచర్ అని చెప్పడం ఇందుకు నిదర్శనం. అంతేకాదు మిజో కమ్యూనిటీలోని ప్రతి బిడ్డ, లింగ భేదం లేకుండా, ముందుగానే సంపాదించడం ప్రారంభిస్తారని నివేదిక పేర్కొంది.
ఇక్కడ "ఏ పని చాలా చిన్నదిగా పరిగణించబడదు, యువత సాధారణంగా 16,17 యేళ్ల వయస్సులోనే ఉపాధిని పొందుతారని నివేదికలు చెబుతున్నాయి. ఉపాధి దిశగా అడుగులు వేస్తున్న సమయంలో వారిని ప్రోత్సహించడంలో ఎటువంటి వివక్ష ఉండదని అధ్యయనాలు చెబుతున్నాయి. మిజోరంలో విడిపోయే కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే కష్ట సమయాల్లో అందరూ సహకారం అందిస్తారని అక్కడి పౌరులు చెబుతున్నారు.తమ జీవనోపాధిని పొందడంలో మరొకరిపై ఆధారపడనపుడు.. ఒక జంట కలిసి జీవించలేని పరిస్థితుల్లో ఉన్నపుడు ఎందుకు కొనసాగాల్సిన అవసరం ఉందా? అని అంటున్నారు.
Updated Date - 2023-04-19T18:50:11+05:30 IST