ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tipu Sultan: కేరళలో రాడికల్ జీహాదిజమ్‌ విత్తనాలు నాటినవాడు టిప్పు సుల్తానా?...

ABN, First Publish Date - 2023-05-05T10:57:47+05:30

‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై వివాదం జరుగుతున్న సమయంలో కేరళలో రాడికల్ జీహాదిజం గురించి వాస్తవాలు తెలుసుకోవాలి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ‘ది కేరళ స్టోరీ’ చిత్రంపై వివాదం జరుగుతున్న సమయంలో కేరళలో రాడికల్ జీహాదిజం గురించి వాస్తవాలు తెలుసుకోవాలి. దేశంలో అక్షరాస్యత శాతం ఎక్కువగా ఉన్న కేరళలో ఈ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో అర్థం చేసుకోవాలి. దీనికి నిజమైన విలన్ టిప్పు సుల్తాన్ అని పలువురు చరిత్రకారులు చెప్తున్నారు. వీరు చెబుతున్న వివరాల ప్రకారం...

మలబార్ ప్రాంతం అత్యధిక శాతం హిందువులదే. ఈ ప్రాంతంలోని ముస్లింలను మోప్లాస్ (Moplahs) అంటారు. హిందువుల భూములను కౌలుకు తీసుకుని ముస్లింలు సాగు చేసేవారు. పండిన పంటలో కొంత భాగం హిందూ యజమానులకు ఇచ్చేవారు. ఈ పద్ధతి అప్పట్లో భారత దేశంలో మాత్రమే కాకుండా యూరోపు, చైనా, అమెరికాలలో కూడా ఉండేది.

1766-92 మధ్య కాలంలో హైదర్, టిప్పు సుల్తాన్ మలబార్‌పై దాడి చేశారు. మోప్లాస్ ముస్లింలు కాబట్టి హైదర్, టిప్పులకు మద్దతు పలికారు. హైదర్, టిప్పు హిందువుల భూముల్లో అత్యధిక భాగాన్ని కబ్జా చేశారు. ఆ భూములను మోప్లాస్‌కు పంచిపెట్టారు. అక్కడ ఉండే హిందువులను మలబార్ నుంచి టిప్పు, హైదర్ తరిమికొట్టారు. అక్కడి హిందువులు సమీపంలోని ట్రావన్‌కోర్ వంటి హిందూ రాజ్యాలకు వెళ్లి, శరణార్థులుగా జీవించారు. కొన్ని దశాబ్దాల క్రితం కశ్మీరీ పండిట్లను తరిమికొట్టినట్లుగానే ఈ దారుణాలు జరిగాయి.

1799లో నాలుగో ఆంగ్లో-మైసూరు యుద్ధం జరిగింది. టిప్పును ఓడించి, హత్య చేసి, మైసూరును బ్రిటిషర్లు తమ రాజ్యంలో కలుపుకున్నారు. బ్రిటిషర్లు హిందువులను మళ్లీ మలబార్‌కు పిలిచి, ముస్లింల నుంచి వారి భూములను లాక్కుని, తిరిగి హిందువులకు ఇచ్చేశారు. దీంతో మలబార్ ప్రాంతం ముస్లిం మెజారిటీ ఏరియాగా మారలేదు. ముస్లింల ఆర్థిక శక్తి కూడా తగ్గిపోయింది.

అయితే ఈ పరిణామాల వల్ల మోప్లాస్, హిందువుల మధ్య అనేక ఘర్షణలు జరిగాయి. 19వ శతాబ్దంలో ఈ రెండు వర్గాల మధ్య తీవ్రంగా పోరాటాలు జరిగాయి. వీటిలో ముఖ్యమైనది 1836లో జరిగిన పోరాటం. 1921లో మోప్లా హిందూ-క్రిస్టియన్ నరమేధం జరిగింది. కేరళలో జీహాదీ ప్రభావాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు బ్రిటిషర్లు అన్ని ప్రయత్నాలు చేశారు. మోప్లా జీనోసైడ్ వారికి ఈ అవకాశాన్ని ఇచ్చింది. గూర్ఖా రెజిమెంట్‌ను ప్రయోగించి 1921-22లలో అల్లర్లను అణచివేసింది. ఈ ఘర్షణలకు ముఖ్య కారకులను (వీరిలో అత్యధికులు ముస్లింలు) ఉరి తీశారు, మరికొందరిని అండమాన్స్‌కు పంపించేశారు. మోప్లాస్ ఆస్తులను వేలం వేశారు. దీంతో ముస్లింల ఆర్థిక బలం తగ్గింది. ఈ చర్యల ద్వారా కేరళ ఇస్లామిక్ రాజ్యంగా, ఖిలాఫత్ రాజ్యంగా మారకుండా ఆపగలిగారు. ఇదీ ఆ చరిత్రకారుల మాట...

ఇవి కూడా చదవండి :

Big Relief For Consumers: కేంద్రం ఆదేశంతో తగ్గనున్న వంటనూనెల ధరలు

Amit Shah: అమిత్‌షా సంచలన కామెంట్స్.. ఆయన్ను చేర్చుకోవాలని ఒత్తిడి చేయం..

Updated Date - 2023-05-05T18:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising