Tomato: టమోటా మరింత ప్రియం.. కిలో ఎంతంటే..
ABN, First Publish Date - 2023-07-29T11:52:15+05:30
రాష్ట్రంలో కొండెక్కిన టమోటా ధరలు ఇప్పట్లో దిగివచ్చే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. కొద్ది రోజుల్లో చేతికి రానున్న టమోటా
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొండెక్కిన టమోటా ధరలు ఇప్పట్లో దిగివచ్చే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. కొద్ది రోజుల్లో చేతికి రానున్న టమోటా పంట ఇటీవలి భారీ వర్షాల కారణంగా దెబ్బతినడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం టమోటా కిలో ధర రూ.80 నుంచి రూ.100 పలుకుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టమోటాలన్నీ వారం రోజులకు సరిపోతాయని, ఆపై వీటికి తీవ్ర కొరత ఏర్పడి ధర రూ.150కు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 80వేల హెక్టార్లలో టమోటా పంటను పండిస్తున్నారు. ప్రత్యేకించి కోలారు, చిక్కబళ్లాపుర(Chikkabellapura) జిల్లాల్లో టమోటా తోటలు అధికంగా ఉన్నాయి. ఆగస్టు రెండోవారానికి మార్కెట్‌లోకి టమోటా పంట రావాల్సి ఉంది. భారీ వర్షాల దెబ్బకు టామోటా పంటకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఈ నేపథ్యంలో ఆగస్టు రెండో వారంలో మార్కెట్‌లోకి టమోటా పంట వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఈ వర్గాలు అంటున్నాయి. టమోటా, బీన్స్ మినహా మిగిలిన అన్ని కూరగాయల ధరలు ప్రస్తుతం కిలో రూ.40 నుంచి రూ.80లోపే ఉన్నాయి.
Updated Date - 2023-07-29T11:52:15+05:30 IST