Earthquake: బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత నమోదు
ABN, First Publish Date - 2023-12-02T13:26:35+05:30
బంగ్లాదేశ్(Bangladesh)ని మరో సారి భూకంపం(Earthquake) వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత నమోదయ్యింది.
ఢాకా: బంగ్లాదేశ్(Bangladesh)ని మరో సారి భూకంపం(Earthquake) వణికించింది. రిక్టర్ స్కేల్‌పై 5.6 తీవ్రత నమోదయ్యింది. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం 09.05 గంటలకు బంగ్లాదేశ్ లోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది.
రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.6గా నమోదయింది. బంగ్లాదేశ్ కి సరిహద్దులో ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనల్లో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. తాము భూకంప తీవ్రతకు సంబంధించి ఎలాంటి రిపోర్ట్ అందుకోలేదని.. భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరిగినట్లు తెలియరాలేదని ఓ అధికారి మీడియాతో చెప్పారు. కోల్‌కతా పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని స్పష్టం చేశారు.
Updated Date - 2023-12-02T13:27:10+05:30 IST