ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tripura: ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-08T16:48:51+05:30

త్రిపుర సీఎం మాణిక్ సాహా వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీని పవిత్ర గంగానదితో పోలుస్తూ, అందులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగర్తలా: త్రిపుర సీఎం మాణిక్ సాహా (Manik saha) వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీని పవిత్ర గంగానదితో పోలుస్తూ, అందులో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని వ్యాఖ్యానించారు. పాపాలు కడిగేసుకోవాలంటే బీజేపీలో చేరాలన్నారు. సౌత్ త్రిపురలోని కాకర్‌బన్‌లో ఆదివారంనాడు జరిగిన జన్ విశ్వాస్ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ తాజా వ్యాఖ్యలు చేశారు. 2023 జనవరి 5న జన్ విశ్వాస్ ర్యాలీని కేంద్ర హోం మంత్రి ప్రారంభించారు.

స్టాలిన్, లెలిన్ ఐడియాలజీ ఉన్న వాళ్లూ చేతులు కలపండి..

కాగా, జన్‌విశ్వాస్ ర్యాలీని ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ, ఈ ఏడాది జరుగనున్న త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీని గంగానదితో పోలుస్తూ, స్టాలిన్, లెలిన్ సిద్ధాంతాలపై నమ్మకం ఉన్న వారు బీజేపీలో చేరాలని పిలుపునిస్తారు. ''రైలు బోగీల్లో ఇంకా ఖాళీలున్నాయి. ఖాళీ బోగీల్లో కూర్చోండి. ప్రధానమంత్రి నేరంద్ర మోదీ మనం చేరాల్సిన గమ్యానికి చేరుస్తారు'' అని అన్నారు. విపక్ష సీపీఎంపై విమర్శలు చేస్తూ, కమ్యూనిస్టుల హయాంలో ప్రజాస్వామ్యం ఉండదని, ఎందుకంటే వారు హింస, టెర్రర్ టాక్టిక్స్‌ను నమ్ముతారని అన్నారు. ప్రజల ప్రజాస్వామిక హక్కులను తుంగలో తొక్కుతూ ఏళ్ల తరబడి వాళ్లు త్రిపురను పాలించారని అన్నారు. దక్షిణ త్రిపుర జిల్లాలో వామపక్షాల హయాంలో 68 మంది విపక్ష నేతలు హత్యకు గురయ్యారని, ఇందుకు కాకబర్‌బన్‌ కూడా మినహాయింపు కాదని చెప్పారు. కాగా, బీజేపీలో చేరితో తప్పులన్నీ ఒప్పులవుతాయని మాణిక్ సాహా చెప్పడం ఏమిటంటూ విపక్షాలు నిలదీశాయి.

Updated Date - 2023-01-08T16:57:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising