జమ్మూలో పేట్రేగిన ఉగ్రవాదులు.. ఇద్దరు ఆర్మీ అధికారులు, పోలీస్, జవాన్ మృతి
ABN, First Publish Date - 2023-09-13T21:18:40+05:30
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల మీద కాల్పులకు పాల్పడటంతో పలువురు అమరులయ్యారు.
జమ్మూ కశ్మీర్(Jammu Kashmir) లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా బలగాల మీద కాల్పులకు పాల్పడటంతో పలువురు అమరులయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంత్ నాగర్ జిల్లా కోకర్ నాగ్ ప్రాంతంలో సెప్టెంబర్ 13న ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ కల్నల్(Army) మన్ ప్రీత్ సింగ్, మేజర్ అశిష్, కశ్మీర్ పోలీస్ హుమాయున్ భట్, జవాన్ రవి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు.
నార్లా ప్రాంతంలో భద్రతా బలగాల ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. రాజౌరి ప్రాంతంలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్ర కదలికలు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో సమాచారం అందుకన్న ఆర్మీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే మృతుల వివరాలపై స్పష్టత రాలేదని అధికారులు చెబుతున్నారు.
Updated Date - 2023-09-13T21:54:15+05:30 IST