ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Encounter: జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN, First Publish Date - 2023-05-04T08:02:56+05:30

జమ్మూకశ్మీరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....

Baramulla Encounter
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బారాముల్లా(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.(Baramulla Encounter)జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లాలో గురువారం ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు(Two terrorists) హతమయ్యారు. అప్రమత్తమైన ఆర్మీ దళాలు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేశాయి. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని పిచ్నాడ్ మచిల్ ప్రాంతంలో బుధవారం భద్రతా దళాలు ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపాయి.దీంతో జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇది కూడా చదవండి : Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం...10మంది మృతి

సంఘటన స్థలంలో ఏకే 47 రైఫిల్, ఒక పిస్టల్‌, ఆయుధాలు,మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని వనిగామ్ పయీన్ క్రీరీ ప్రాంతంలో ఉగ్రవాదుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారంతో భద్రతా బలగాలు గురువారం తెల్లవారుజామున అక్కడ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయని పోలీసు అధికారి చెప్పారు.భద్రతా బలగాల సెర్చ్ పార్టీపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ ఎన్‌కౌంటర్‌గా(Encounter) మారింది. కుప్వారాలో చొరబాటు యత్నం విఫలమైంది.ఎల్‌ఓసి మీదుగా మచిల్ సెక్టార్ వైపు టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్‌లలో ఒకదాని నుంచి ఉగ్రవాదులు మనదేశంలోకి చొరబడే అవకాశం ఉందని సమాచారం అందింది. దీంతో కేంద్ర భద్రతా దళాలను హై అలర్ట్ చేశామని శ్రీనగర్‌కు చెందిన డిఫెన్స్ ప్రతినిధి కల్నల్ ఎమ్రాన్ ముసావి చెప్పారు.

Updated Date - 2023-05-04T08:43:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising