ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Two vehicles: ఆహా.. తెలివి అంటే వీరిది.. కానీ.. చివరకు..

ABN, First Publish Date - 2023-06-08T08:32:39+05:30

ఒకే రిజిస్ట్రేషన్‌ నెంబరుతో రెండు వాహనాలను నడుపుతున్న ప్రబుద్ధులు, వాటి ద్వారా రోజుకు 2,500 లీటర్ల పాలను చోరీ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(చెన్నై): ఒకే రిజిస్ట్రేషన్‌ నెంబరుతో రెండు వాహనాలను నడుపుతున్న ప్రబుద్ధులు, వాటి ద్వారా రోజుకు 2,500 లీటర్ల పాలను చోరీ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంలో చాలామంది హస్తం ఉంటుందని భావిస్తున్న అధికారులు, ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించారు. వేలూరు(Vellore) సత్తువాచారిలో వున్న సహకార పాల్ప ఉత్పత్తిదారుల కేంద్రమైన ఆవిన్‌ సంస్థ రైతుల నుంచి రోజుకు సుమారు లక్షా 10 వేల లీటర్ల పాలు కొనుగోలు చేస్తోంది. ఈ పాలను శీతలీకరణ చేసిన అనంతరం ప్యాకెట్లలో నింపి, సుమారు 600 మంది డీలర్లకు 20 కాంట్రాక్టు వాహనాల ద్వారా సరఫరా చేస్తోంది. వేలూరు సహా మూడు జిల్లాల్లో 76 వేల లీటర్ల పాలను విక్రయిస్తున్నారు. ఇది కాకుండా వేలాది లీటర్ల పాలను చెన్నైకి కూడా సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వేలూరు ఆవిన్‌ సంస్థలో తరచూ పాల చోరీ జరుగుతున్నట్లు తేలడంతో, దీన్ని అడ్డుకోవాలని ఆవిన్‌ జనరల్‌ మేనేజర్‌ గతంలో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గత నెల ఆవిన్‌ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పాల సరఫరా చేస్తున్న వాహనాలను పరిశీలించారు. ఆ సమయంలో ఆర్కాడు సమీపంలో వున్న తిమిరి రూట్‌లో తరలించే పాల వ్యాన్‌లో చోరీ జరుగుతున్నట్లు గమనించారు. దీనిని నిలదీసిన ఆవిన్‌ ఇంజనీరింగ్‌ విభాగం మేనేజర్‌ కనకరాజ్‌పై కొంతమంది దాడి చేశారు. దీనిపై సత్తువాచారి పోలీస్‌స్టేషన్‌(Police Station)లో కేసు నమోదైంది. ఈ సంఘటన అనంతరం కూడా సత్తువాచారి ఆవిన్‌ పాల ప్లాంట్‌లో చోరీ కొనసాగుతూనే వుంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారులు తీవ్ర దర్యాప్తు ప్రారంభించారు. దీంతో ఆవిన్‌ పాల ప్లాంట్‌ నుంచి ఒకే రిజిస్ట్రేషన్‌ నెంబరుతో రెండు వ్యాన్లు నడిపి, వాటి ద్వారా రోజుకు సుమారు 2,500 లీటర్ల పాలు చోరీ చేస్తున్నట్లు తేలింది. మంగళవారం రాత్రి అధికారులు పాల ప్లాంట్‌ను పరిశీలించిన సమయంలో టీఎన్‌23ఏసీ 1352 పేరుతో ఒకే రిజిస్ట్రేషన్‌ నెంబరున్న రెండు వ్యాన్లలో పాల ప్యాకెట్లు లోడ్‌ చేయడం గమనించారు. దిగ్ర్భాంతి చెందిన అధికారులు.. ఆ రెండు వ్యాన్లను పాల ప్యాకెట్ల సహా స్వాధీనం చేసుకున్నారు. దీనిపై అధికారులు వేలూరు ప్రాంతీయ ఆర్టీఏ అధికారికి సమాచారం అందజేశారు. వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆ రెండు వ్యాన్ల రిజిస్ట్రేషన్‌ నెంబర్లను పరిశీలించి సీలు వేశారు. ఒకే రిజిస్ట్రేషన్‌ నెంబరు కలిగిన ఈ వ్యాన్ల యజమాని ఎవరు? ఇందులో ఎవరెవరికి భాగస్వామ్యం ఉంది తదితర కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.

Updated Date - 2023-06-08T08:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising