ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

UCC: 75 లక్షలకు పైగా స్పందనలు, గడువు పొడిగించేది లేదన్న లా కమిషన్

ABN, First Publish Date - 2023-07-28T15:36:07+05:30

ఉమ్మడి పౌరస్మృతిపై ప్రజలు, వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన 22వ లా కమిషన్‌కు ఇంతవరకూ 75 లక్షలకు పైగా స్పందనలు అందాయి. ఈ విషయాన్ని లా కమిషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. యూసీసీపై అభిప్రాయాలను తెలియజేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించేది లేదని పేర్కొంది.

న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతి (UCC)పై ప్రజలు, వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఏర్పాటైన 22వ లా కమిషన్‌కు ఇంతవరకూ 75 లక్షలకు పైగా స్పందనలు అందాయి. ఈ విషయాన్ని లా కమిషన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. యూసీసీపై అభిప్రాయాలను తెలియజేసేందుకు ఇచ్చిన గడువును పొడిగించేది లేదని పేర్కొంది. తమకు అందిన 75 లక్షల స్పందనలలో 2 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రధాన మంత్రికి పార్వార్డ్ చేసినట్టు చెప్పింది.


యూసీసీపై వచ్చిన స్పందనల సంకలనం పని జూలై 28వ తేదీనుంచి ప్రారంభమవుతుందని, ఫీడ్ బ్యాక్ ఆధారంగా స్పందనల విశ్లేషణ ఉంటుందని లా కమిషన్ తెలిపింది. ఎంపిక చేసిన పార్టీలతో ముఖాముఖీ చర్యలను కూడా ప్యానల్ జరుపనుంది.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఒక కార్యక్రమంలో యూసీసీ అంశాన్ని ప్రస్తావించారు. ఒకే ఇంట్లో రెండు చట్టాల ఉంటే పురోగతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఏకరీతి చట్టం అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. ఈ నేపథ్యంలో యూసీసీపై దేశవ్యాప్త చర్చ మొదలైంది.


యూసీసీ అంటే..

ప్రజల వ్యక్తిగత వ్యవహారాలైన పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత వంటి అంశాల్లో మతానికి సంబంధం లేకుడా ఒకే విధమైన చట్టాన్ని తీసుసురావడమే యూసీసీ. ఇండియాలో మతం ఆధారంగా వ్యక్తిగత చట్టాలు ఉన్నందున వాటి స్థానే ఒకే చట్టాన్ని తీసుకురావడం యూసీసీ ఉద్దేశం. ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో ఉన్నందున ఈ దిశగా కేంద్రం పావులు కదుపుతోంది. గతంలోనూ కేంద్రంలోని ప్రభుత్వాలు ఉమ్మడి పౌరస్మృతిపై చర్చలు జరిపినా, అది కార్యరూపం దాల్చలేదు. భిన్న మతాలు, విభిన్న ఆచార, సాంప్రదాయాలు, భిన్నత్వాలకు నెలవైన భారతదేశంలో యూసీసీని అమలు చేయడం కష్టమనే అభిప్రాయలు ఉన్నాయి. అయితే ఉమ్మడి పౌర స్మృతితో అందరికీ సమాన హక్కులు లభిస్తాయని, లింగ సమానత్వం ఏర్పడుతుందని కేంద్రం వాదనగా ఉంది. 2019 బీజేపీ ఎన్నికల ఎజెండాలోనూ ఉమ్మడి పౌరస్మృతి అంశం ఉంది.

Updated Date - 2023-07-28T15:36:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising