Vande Bharat Express: వందేభారత్‌కు తప్పిన అతిపెద్ద ప్రమాదం.. ట్రాక్‌పై వరుసగా రాళ్లు, ఇనుప రాడ్లు
ABN, First Publish Date - 2023-10-02T16:46:04+05:30
ఎందుకో తెలీదు కానీ.. కొందరు దుండగులు ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లను టార్గెట్ చేశారు. ఇప్పటికే ఈ వందేభారత్‌పై చాలాచోట్ల రాళ్లతో దాడులు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఒక ట్రైన్‌కు...
ఎందుకో తెలీదు కానీ.. కొందరు దుండగులు ‘వందేభారత్’ ఎక్స్‌ప్రెస్ రైళ్లను టార్గెట్ చేశారు. ఇప్పటికే ఈ వందేభారత్‌పై చాలాచోట్ల రాళ్లతో దాడులు చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఒక ట్రైన్‌కు అతిపెద్ద ప్రమాదం తప్పింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఉదయ్‌పూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సోమవారం ఉదయ్‌పూర్ నుంచి బయలుదేరింది. అయితే.. కొంత దూరం ప్రయాణించిన తర్వాత భిల్వారా సమీపంలో రైల్వే ట్రాక్‌పై వరుసగా రాళ్లు, ఇనుప రాడ్లు పేర్చి ఉండటాన్ని గమనించారు. దీంతో.. వెంటనే రైలు ఆపి, రైల్వే ఉద్యోగులు వాటిని తొలగించడానికి కిందకు దిగారు. రాళ్లు తొలగిస్తున్న క్రమంలో.. మరో షాకింగ్ విషయాన్ని వాళ్లు గుర్తించారు.
రైలు ఆగిన చోటు నుంచి 10-15 అడుగుల దూరంలో పెద్ద రాళ్లను వరుసగా పేర్చారు. అంతేకాదు.. పట్టాలను కలిపే లింక్ వద్ద రెండు ఇనుప రాడ్లను కూడా ఇరికించారు. ఆ పెద్ద రాళ్లు కింద పడకుండా ఉండేందుకు.. అటు, ఇటు రెండు రాడ్లు అమర్చారు. ఒకవేళ ఇది గుర్తించకుండా రైలు వేగంగా వెళ్లి ఉంటే, బహుశా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. ‘డీ-రెయిల్’ (పట్టాలు తప్పడం) అయ్యే అవకాశం లేకపోలేదని నిపుణులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. ఎవరో కావాలనే ప్రమాదం జరగాలన్న ఉద్దేశంతో ఈ రాళ్లను పక్కా ప్లానింగ్‌తో పేర్చి ఉంటారని తెలుస్తోంది. రైల్వే అధికారులు ఈ మొత్తం తతంగాన్ని తమ ఫోన్‌లో రికార్డ్ చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో.. ఆ రాళ్లు, ఇనుప రాడ్లు ఎవరు పేర్చారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది.
ఇదిలావుండగా.. ఈ ఉదయపూర్-జైపూర్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును సెప్టెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభించారు. ఈ రైలు ఉదయపూర్, చిత్తోర్‌గఢ్, భిల్వారా, అజ్మీర్, జైపూర్‌తో సహా రాష్ట్రంలోని ఐదు జిల్లాల గుండా వెళుతుంది. తన మార్గంలో ఈ రైలు కిషన్‌గఢ్, అజ్మీర్, భిల్వారా, చందేరియా, మావ్లీ జంక్షన్, రాణా ప్రతాప్ నగర్ స్టేషన్‌లలో ఆగుతుంది. ఇది ఉదయపూర్‌లో ఉదయం 7.50 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1.50 గంటలకు జైపూర్ చేరుకుంటుంది. అక్కడి నుంచి తిరిగి సాయంత్రం 4 గంటలకు జైపూర్‌లో బయలుదేరి రాత్రి 10 గంటలకు ఉదయపూర్ చేరుకుంటుంది.
Updated Date - 2023-10-02T16:46:04+05:30 IST