Corona Cases: దేశంలో కరోనా కలకలం.. ఒకే ఒక్క రోజులో ఎన్ని కేసులంటే..
ABN, First Publish Date - 2023-12-09T18:19:00+05:30
ప్రపంచాన్నే వణికించిన కరోనా పేరు చెబితే చాలు అంతా భయంతో వణికిపోయేవారు. అయితే రాను రాను దాని ప్రభావం తగ్గిపోవడంతో ప్రస్తుతం చర్చించుకోవడమే మానేశారు. అయితే..
ప్రపంచాన్నే వణికించిన కరోనా పేరు చెబితే చాలు అంతా భయంతో వణికిపోయేవారు. అయితే రాను రాను దాని ప్రభావం తగ్గిపోవడంతో ప్రస్తుతం చర్చించుకోవడమే మానేశారు. అయితే ప్రస్తుతం చలికాలం ప్రారంభమవడంతో కారోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దేశంలో శనివారం ఒక్కరోజే 148 కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డిసెంబర్ 9న ఈ వివరాలు వెళ్లడించింది.
కొత్త కేసులతో కలిపి ప్రస్తుతం కరోనా కేసుల (Corona cases) సంఖ్య 808కి పెరిగింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 4,50,02,889 మంది కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిసింది. అలాగే మొత్తం 5,33,306 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా నుంచి 4,44,68,775 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలాగే జాతీయ రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.19 శాతంగా ఉందని వెళ్లడించింది. దేశంలో ఇప్పటి వరకూ మొత్తం 20.67 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Union Ministry of Health) వెబ్‌సైట్ నివేదించింది.
Updated Date - 2023-12-09T18:19:02+05:30 IST