ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Google : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ భేటీ

ABN, First Publish Date - 2023-05-09T21:19:59+05:30

: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మంగళవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ (Google CEO Sundar Pichai)తో గూగుల్

Sundar Pichai, Aswini Vashnav
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాలిఫోర్నియా : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) మంగళవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌ (Google CEO Sundar Pichai)తో గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం వైష్ణవ్ ఇచ్చిన ట్వీట్‌లో, తాను సుందర్ పిచాయ్‌ని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌లో కలిసినట్లు తెలిపారు. ఇండియా స్టాక్, మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ల గురించి మంచి చర్చ జరిగిందని తెలిపారు.

ఇదిలావుండగా, గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమం కోసం సుందర్ పిచాయ్ గత సంవత్సరం భారత దేశంలో పర్యటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌లతో సమావేశమయ్యారు. ప్రధాని మోదీతో సమావేశం బాగా జరిగిందని పిచాయ్ తెలిపారు. మోదీ నేతృత్వంలో టెక్నలాజికల్ మార్పులు వేగంగా జరుగుతుండటాన్ని చూడటం స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. మన బలమైన భాగస్వామ్యం కొనసాగాలని ఆకాంక్షించారు. అందరికోసం పని చేసే ఓపెన్, కనెక్టెడ్ ఇంటర్నెట్‌ను అభివృద్ధి చేసేందుకు జీ20 ప్రెసిడెన్సీకి భారత దేశానికి మద్దతిస్తామని తెలిపారు.

ప్రధాని మోదీ కూడా ఈ సమావేశం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మానవాళి సౌభాగ్యం కోసం, సుస్థిర అభివృద్ధి కోసం ప్రపంచమంతా కలిసికట్టుగా పని చేయవలసిన అవసరం ఉందన్నారు.

ఇవి కూడా చదవండి :

Sachin Pilot: గెహ్లాట్ లీడర్ సోనియా కాదు, వసుంధరా రాజే..

Indian Army : సైన్యంలో యూనిఫాం సంస్కరణలు

Updated Date - 2023-05-09T21:19:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising