VK Singh on POK: పీఓకే ఇండియాలో కలిసిపోతుంది..వీకే సింగ్ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-09-11T21:01:07+05:30
కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ సహాయ మంత్రి రిటైర్డ్ జనరల్ వీకే సింగ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే కొద్దికాలం తర్వాత దానంతట అదే ఇండియాలో కలిసిపోతుందని చెప్పారు. ''కొద్దిరోజులు ఆగండి. పీఎంకే ఆటోమాటిక్‌గా ఇండియాతో విలీనమవుతుంది'' అని దౌసలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు.
జైపూర్: కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ సహాయ మంత్రి రిటైర్డ్ జనరల్ వీకే సింగ్ (VK Singh) పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పీఓకే కొద్దికాలం తర్వాత దానంతట అదే ఇండియాలో కలిసిపోతుందని చెప్పారు. ''కొద్దిరోజులు ఆగండి. పీఎంకే ఆటోమాటిక్‌గా ఇండియాతో విలీనమవుతుంది'' అని దౌసలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వ్యాఖ్యానించారు. ఇండియాకు రోడ్లు తెరవాలని పీఓకే షియా ముస్లింలు చేస్తు్న్న డిమాండ్‌పై మీడియా అడిగినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జీ-20 ఇంత గొప్పగా ఎప్పుడూ జరగలేదు..
జి-20 సదస్సు విజయవంతం కావడంపై వీకే సింగ్ మాట్లాడుతూ, చాలా గొప్పగా ఈ ఈవెంట్ సక్సెస్ అయిందని, గతంలో ఎప్పుడూ నిర్వహించనంత గొప్పగా నిర్వహించారని చెప్పారు. దేశంలోని సుమారు 60 నగరాల్లో 200 సమావేశాలు జరిగాయని చెప్పారు. ఇంతటి విజయవంతగా సదస్సును నిర్వహించడంపై ఇతర దేశాలు కూడా ఇండియా శ్లాఘించాయని తెలిపారు. సమష్టిగా మేనిఫెస్టో విడుదల చేయడం పెద్ద విజయమన్నారు. ఉక్రెయిన్ సహా అనేక అంశాలపై ప్రపంచ దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయని, అయితే మనం అందర్నీ కలుపుకొని వెళ్లి ఒక మార్గం కోసం ప్రయత్నించామని, దీనికి ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని అన్నారు. బయో ఫ్యూయల్ అలయెన్స్, ఇండియా నుంచి యూరప్ వరకూ కారిడార్ వంటివి ఇండియా ఆర్థిక ప్రగతికి దోహదపడతాయని విశ్లేషించారు.
Updated Date - 2023-09-11T21:02:49+05:30 IST