ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yogi hockey: హాకీ బ్యాట్ పట్టిన యోగి

ABN, First Publish Date - 2023-08-29T20:51:36+05:30

నిత్యం రాజకీయాలతో తలమునకలయ్యే నేతలు ఒక్కోసారి అటవిడుపుగా తమకు నచ్చిన క్రీడల్లోనూ ఓ చేయి వేస్తుంటారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం మంగళవారంనాడు హాకీ బ్యాట్ పట్టారు. అయితే, ఇది ఆటవిడువుగా కాకుండా జాతీయ క్రీడా దినోత్సవాల సందర్భంగా ఆయన హ్యాకీ బ్యాట్‌తో దర్శనమిచ్చారు.

ఝాన్సీ: నిత్యం రాజకీయాలతో తలమునకలయ్యే నేతలు ఒక్కోసారి అటవిడుపుగా తమకు నచ్చిన క్రీడల్లోనూ ఓ చేయి వేస్తుంటారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సైతం మంగళవారంనాడు హాకీ (Hockey) బ్యాట్ పట్టారు. అయితే, ఇది ఆటవిడువుగా కాకుండా జాతీయ క్రీడా దినోత్సవాల సందర్భంగా ఆయన హ్యాకీ బ్యాట్‌తో దర్శనమిచ్చారు. ఝాన్సీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తూ, హాకీ క్రీడాకారులతో ఫోటో దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.


దీనికి ముందు యోగి ఆదిత్యనాథ్ తన అధికారిక నివాసంలో 'జనతా దర్శన్' ప్రోగ్రాంలో పాల్గొన్నట్టు సీఎం కార్యాలయం తెలిపింది. ప్రజల సమస్యలను సకాలంలో సంతృప్తికరమైన రీతీలో పరిష్కరిస్తామని యోగి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారని, సమస్యలపై అధికారులు జాప్యం చేస్తే తన దృష్టికి తీసుకురావాలని, వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని సీఎం కార్యాలయం పేర్కొంది. శాశ్వత గృహాలు లేవని విజ్ఞాపనలు చేసేవారిని ప్రధాన మంత్రి ఆవాస్ యోచన లేదా ముఖ్యమంత్రి ఆవాస్ యోజన పరిధిలోకి తీసుకువచ్చి వారి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారని తెలిపింది.

Updated Date - 2023-08-29T21:00:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising