ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atiq Ahmed : అతిక్ హత్య వార్తతో ఆకాశంలోకి చూసి నమస్కరించిన బాధితురాలు

ABN, First Publish Date - 2023-04-23T18:29:33+05:30

మాఫియా డాన్ అతిక్ అహ్మద్ సోదరులు హతులైనట్లు తెలుసుకున్న బాధితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దశాబ్దాల తరబడి వారితో

Atiq Ahmed
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : మాఫియా డాన్ అతిక్ అహ్మద్ సోదరులు హతులైనట్లు తెలుసుకున్న బాధితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. దశాబ్దాల తరబడి వారితో పోరాడుతున్నవారు కాస్త ఊపిరి తీసుకుంటున్నారు. అలాంటివారిలో ఒకరు ప్రయాగ్‌రాజ్‌కు చెందిన రామ్‌కలి. ఆమె ఈ వార్త తెలుసుకున్న వెంటనే ఆకాశంలోకి చూస్తూ భగవంతునికి నమస్కారం చేశారు.

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్, ఝల్వా ప్రాంతానికి చెందిన రామ్‌కలికి మంచి ప్రదేశంలో భూమి ఉంది. ఆ భూమిని తమకు అమ్మేయాలని అతిక్ (Atiq Ahmed) సోదరులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. వారికి అమ్మడం ఇష్టం లేని రామ్‌కలి 35 ఏళ్ళ నుంచి పోరాడుతున్నారు. ఈ పోరాటంలో ఆమె తన భర్తను, కుమారుడిని కోల్పోయారు. సర్వస్వాన్నీ కోల్పోయినప్పటికీ, ఆమె ధైర్యసాహసాలతో ఆ భూమి కోసం పోరాడుతున్నారు. అతిక్ సోదరులు హత్యకు గురైనట్లు తెలుసుకుని ఆమె చాలా సంతోషించారు. అతిక్ ఉగ్రవాదం అంతమైందని హర్షం వ్యక్తం చేశారు.

రామ్‌కలి మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ఆమెకు ఝల్వాలో ఇండియన్ ఆయిల్ డిపో ఎదురుగా సుమారు 7 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని తమకు అమ్మాలని అతిక్ మనుషులు దాదాపు 35 ఏళ్ల క్రితం ఆమె వద్దకు వెళ్లారు. మొదట్లో భూమిని కొంటామని చెప్పినా, ఆ తర్వాత ఆమెను బెదిరించారు. అప్పటి వరకు సంతోషంగా గడిపిన ఆ కుటుంబానికి అప్పటి నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. ఒకొక్కసారి అతిక్ మనుషులు ఆమె ఇంటి చుట్టూ సంచరిస్తూ, బెదిరించేవారు. అది తమ పూర్వీకుల స్థలమని, తాము అమ్మేది లేదని కరాఖండీగా ఆమె చెప్పేవారు.

‘‘1989లో నా భర్త బ్రిజ్ మోహన్ కుష్వాహా ఓ ఫ్యాక్టరీలో పని చేసేవారు. ఓ రోజు ఆయన ఫ్యాక్టరీకి వెళ్లి తిరిగి రాలేదు. తమ కుటుంబంపై ఒత్తిడి తేవడం కోసం అతిక్ చేసిన పనే ఇది అని తెలుసుకోవడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. నేను ధూమన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, అతిక్‌పై ఫిర్యాదు చేశాను. అతిక్ అప్పట్లో గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతున్నాడు. పోలీసులు నాకు సాయపడలేదు, నన్ను గెంటేశారు’’ అని రామ్‌కలి చెప్పారు.

1989లో అతిక్ మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచాడని, అప్పుడు తనను ఆయన పిలిచి, ‘‘నీ భర్త ఇక లేడు’’ అని చెప్పి, ‘‘నీ భూమిని ఇచ్చేస్తే మీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను’’ అని తనతో అన్నాడని చెప్పారు. అక్కడ బహుళ అంతస్థుల భవనాన్ని నిర్మించుకోవాలని అతిక్ అనుకున్నాడన్నారు. అయితే తాను తన భూమిని ఇచ్చేది లేదని చెప్పానన్నారు. ఆ తర్వాత ఎంతో శ్రమపడి అతనిపై ఫిర్యాదు చేసి, కేసు నమోదు చేయించానని చెప్పారు. 1989 నుంచి 2016 మధ్యలో తనపైనా, తన కుటుంబ సభ్యులపైనా అతిక్ మనుషులు అనేకసార్లు దాడులు చేశారన్నారు.

2016లో అతిక్ మనుషులు తన ఇంటిపై దాడి చేశారని, తన కుమారునికి తుపాకీ గుండు తగిలిందని, ఆయనను ఆసుపత్రిలో చేర్పించి, చికిత్స చేయించామని చెప్పారు. ఆసుపత్రిలో కూడా అతిక్ మనుషులు తనను బెదిరించేవారని చెప్పారు. 2017లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడు, ‘‘ఈ ప్రభుత్వం మాఫియాకు మద్దతివ్వదని నాకు తెలుసు’’ అని చెప్పారు. అతిక్ కొడుకు అసద్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించడం, అతిక్ సోదరులు హత్యకు గురికావడం గురించి వార్తలు రావడంతో తన 35 ఏళ్ళ న్యాయపోరాటం ముగిసిందని ఊపిరి పీల్చుకున్నానని చెప్పారు.

అతిక్ ఉగ్ర చేష్టలకు సాక్షులుగా మిగిలినవారి జాబితాను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిలో రామ్‌కలి పేరు మొదటి వరుసలో ఉంది. ఇటువంటి బాధితులు అనేకమంది ఉన్నారు. వారంతా ఇప్పుడు గొప్ప ఉపశమనం కలిగిందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

Satyapal Malik VS Amit shah: సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన అమిత్‌షా

Sanjay Raut : షిండే ప్రభుత్వం 15 రోజుల్లో కుప్పకూలుతుంది : సంజయ్ రౌత్

Updated Date - 2023-04-23T18:29:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising