Yogi Adityanath : యోగి ఆదిత్యనాథ్ భద్రతా సిబ్బందిలో ఒకరు అనూహ్య మృతి
ABN, First Publish Date - 2023-02-25T10:14:38+05:30
ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, యోగి ఆదిత్యనాథ్ భద్రతా సిబ్బందిలో
లక్నో : ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Chief Minister Yogi Adityanath) భద్రతా సిబ్బందిలో ఒకరు ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ప్రాణాలు కోల్పోయారు. ఆయన తన రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా పేలడంతో, తూటా ఆయన తలలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన శుక్రవారం జరిగింది. ఆయన శనివారం యోగికి భద్రత కల్పించే విధుల్లో చేరవలసి ఉంది.
ఉత్తర ప్రదేశ్‌లోని బారాబంకీ అదనపు పోలీసు సూపరింటెండెంట్ అశుతోష్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం, యోగి ఆదిత్యనాథ్ భద్రతా సిబ్బందిలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సందీప్ యాదవ్ శనివారం విధుల్లో చేరవలసి ఉంది. అయితే ఆయన మసౌలీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న తన ఇంట్లో శుక్రవారం తన సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా, ప్రమాదవశాత్తూ పేలింది, దీంతో తూటా ఆయన తలలోకి దూసుకెళ్లింది. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆయన మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించి, తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Nandamuri Balakrishna అంటే ఆ మాత్రం ఉంటది మరి..మీ అభిమానం సల్లగుండా..
Updated Date - 2023-02-25T10:14:43+05:30 IST