ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vande Sadharan Express: ‘వందే సాధారణ్’ ట్రయల్ రన్ విజయవంతం.. ఇక పరుగులు పెట్టడమే తరువాయి

ABN, First Publish Date - 2023-11-08T18:36:30+05:30

దేశీయ ఉత్పత్తులను ప్రోత్సాహించేందుకు మేకిన్ ఇండియా క్యాంపెయిన్‌ని మొదలుపెట్టిన భారత ప్రభుత్వం.. ఇప్పటికే పలు ప్రోడక్టులను రంగంలోకి తీసుకొచ్చింది. అందులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒకటి. ఇది పూర్తిగా భారతదేశంలో...

Vande Sadharan Trial Run Success: దేశీయ ఉత్పత్తులను ప్రోత్సాహించేందుకు మేకిన్ ఇండియా క్యాంపెయిన్‌ని మొదలుపెట్టిన భారత ప్రభుత్వం.. ఇప్పటికే పలు ప్రోడక్టులను రంగంలోకి తీసుకొచ్చింది. అందులో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా ఒకటి. ఇది పూర్తిగా భారతదేశంలో మన భారతీయ ఇంజినీర్లు తయారు చేసిన మొట్టమొదటి రైలు. ఆల్రెడీ ఇది ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తోంది. ఇప్పుడు వందేభారత్ సాధారణ్ కూడా త్వరలోనే పట్టాలపై పరుగులు పెట్టేందుకు సమాయత్తం అవుతోంది. డిసెంబర్‌లో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలోనే.. నవంబర్ 8వ తేదీన భారతీయ రైల్వే ఈ వందే సాధారణ్ ఎక్స్‌ప్రెస్ ట్రయల్ రన్‌ను నిర్వహించింది. ముంబై నుండి ఈ ట్రయల్ రన్ నిర్వహించగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇది విజయవంతంగా అహ్మదాబాద్‌కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వగా.. ఇది ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. వందే భారత్ రైళ్లు పూర్తిగా ‘ఎయిర్ కండీషన్డ్’ బోగీలతో నడుస్తుండగా.. ఈ వందే సాధారణ్ రైళ్లలో నాన్-ఏసీ బోగీలను కలిగి ఉంటాయి. ఇదొక్కటి మినహాయించి.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఉండే ఇతర అధునాతన ఫీచర్లు ఇందులోనూ ఉంటాయి. 22 కోచ్‌లతో కూడిన ఈ నూతన రైళ్లు.. విభిన్న శ్రేణి ప్రయాణికులకు అనుగుణంగా స్లీపర్, సాధారణ క్లాసులు ఉంటాయి.


అంతేకాదు.. ఈమధ్య రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న తరుణంలో, ముందుగానే ప్రమాదాల గురించి అప్రమత్తం చేసేందుకు ఈ వందే సాధారణ్ రైళ్లలో భద్రతా సెన్సార్లను అమర్చారు. అలాగే.. ప్రయాణికుల భద్రత కోసం బోగీలలోనూ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ రైలుకు రెండు చివర్లలో రెండు ఇంజిన్లు ఉంటాయి. మొత్తం 1800 ప్రయాణికులు ఈ కొత్త రైళ్లలో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. దీని గరిష్ట వేగం 130 kmph ఉంటుంది. ఇప్పుడున్న సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ వందే సాధారణ్ రైళ్లు మరింత వేగంగా ప్రయాణిస్తాయి కాబట్టి.. 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసినప్పుడు సమయం చాలా ఆదా అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

Video Link: https://x.com/IndianTechGuide/status/1722116673401147812?s=20

ముంబై-న్యూఢిల్లీ, పాట్నాన్యూఢిల్లీ, హౌరా-న్యూఢిల్లీ, హైదరాబాద్-న్యూఢిల్లీ, ఎర్నాకులం-గౌహతి సహా పలు ప్రముఖ మార్గాల్లో ఈ వందే సాధారణ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. క్రమంగా.. ఇతర మార్గాల్లోనూ ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా భారత రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. ప్రయాణీకులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన సేవలు అందించాలనే లక్ష్యంతోనే.. భారత రైల్వే ఈ అధునాతన ఫీచర్లు కలిగిన కొత్త రకపు రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోలిస్తే.. ఇందులో టికెట్ ధరలు చాలా తక్కువగా ఉంటాయని సమాచారం.

Updated Date - 2023-11-08T18:36:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising