Mizoram: మిజోరం ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలివే..
ABN, First Publish Date - 2023-11-30T17:27:43+05:30
భారత్‌లో అతి తక్కువ నియోజకవర్గాలున్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ కేవలం 40 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. మిజోరంలో అధికారం చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 21 స్థానాలు సాధించాలి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన జోరం పీపుల్స్ మూమెంట్(ZPM), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) బరిలో ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఆశించినంత బలంగా లేదని పొలిటికల్ నిపుణులు చెబుతున్నారు.
Mizoram Assembly Election 2023 : భారత్‌లో అతి తక్కువ నియోజకవర్గాలున్న రాష్ట్రం మిజోరం. ఇక్కడ కేవలం 40 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. మిజోరంలో అధికారం చేపట్టడానికి మేజిక్ ఫిగర్ 21 స్థానాలు సాధించాలి. కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలైన జోరం పీపుల్స్ మూమెంట్(ZPM), మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), బీజేపీ బరిలో ఉన్నాయి. అయితే బీజేపీ మాత్రం రాష్ట్రంలో ఆశించినంత బలంగా లేదని పొలిటికల్ నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో గెలుపోటములను నిర్ణయించే రేంజ్ లో క్రిస్టియన్ల జనాభా ఉంది. మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంతంగా పూర్తి మెజారిటీ వచ్చే అవకాశాలు లేనందున హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని పలు సర్వేలు గతంలో చెప్పాయి. ఆ మధ్య విడుదలైన ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో ఎంఎన్ఎఫ్- 13 నుంచి 17 సీట్లు, కాంగ్రెస్- 10 నుంచి 14 సీట్లు, జెడ్‌పీఎం- 9 నుంచి 13 సీట్లు, ఇతరులు 1 నుంచి 3 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని తేలింది. ఇదిలా ఉంటే.. జెడ్‌పీఎం ఈసారి కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. అందుకు తగినట్లు అధిష్ఠానం రాష్ట్రంపై తొలి నుంచే స్పెషల్ గా ఫోకస్ పెట్టి ప్రచారం నిర్వహించింది.
పీపుల్స్ పల్స్ సర్వే:
కాంగ్రెస్ - 6 - 10
ఎంఎన్ఎఫ్ - 16 - 20
జెడ్పీఎం - 10 - 14
బీజేపీ - 0
టుడేస్ చాణక్య సర్వే:
కాంగ్రెస్ - 6 - 10
ఎంఎన్ఎఫ్ - 16 - 20
జెడ్పీఎం - 10 - 14
బీజేపీ - 2 - 3
ఇతరులు -
ఏబీపీ - సీ ఓటర్ సర్వే:
కాంగ్రెస్ - 02 - 08
ఎంఎన్ఎఫ్ - 15 - 21
జెడ్పీఎం - 12 - 18
బీజేపీ - 0
రిపబ్లిక్ (Matrize):
కాంగ్రెస్ - 07 - 10
ఎంఎన్ఎఫ్ - 17 - 22
జెడ్పీఎం - 07 - 12
బీజేపీ - 01 - 02
ఎబీసీ - సీ ఓటర్ సర్వే:
కాంగ్రెస్ - 02 - 08
ఎంఎన్ఎఫ్ - 15 - 21
జెడ్పీఎం - 12 - 18
బీజేపీ - 0
టైమ్స్ నౌ(ఈటీజీ) సర్వే:
ఎంఎన్ఎఫ్ - 14 - 18
జెడ్పీఎం - 10 - 14
ఇతరులు - 09 - 15
జన్ కీ బాత్ సర్వే..
కాంగ్రెస్ - 5 - 9
ఎంఎన్ఎఫ్ - 10 - 14
జెడ్పీఎం - 15 - 25
బీజేపీ - 0- 2
ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ సర్వే...
కాంగ్రెస్ - 8 - 10
ఎంఎన్ఎఫ్ - 14 - 18
జెడ్పీఎం - 12 - 16
బీజేపీ - 0- 2
Updated Date - 2023-11-30T19:56:49+05:30 IST