Vishnu Deo Sai: ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయి ప్రమాణస్వీకారం.. మోదీ హాజరు
ABN, Publish Date - Dec 13 , 2023 | 08:41 PM
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత విష్ణు దేవ్ సాయి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర 4వ ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణస్వీకారం చేసారు. రాయపూర్‌లోని సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
రాయపూర్: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత విష్ణు దేవ్ సాయి (Vishnu Deo Sai) ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్ర 4వ ముఖ్యమంత్రిగా బుధవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రులుగా అరుణ్ సావో, విజయ్ శర్మ ప్రమాణస్వీకారం చేసారు. రాయపూర్‌లోని సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘెల్ తదితర నేతలు పాల్గొన్నారు.
బీజేపీ ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించింది. పార్టీ అధిష్ఠానం కేంద్ర పరిశీలకులను సీఎల్‌పీ సమావేశాలకు పంపి ఏకగ్రీవంగా సీఎంలను ఎంపిక చేసింది. విశ్లేషకుల అంచనాలకు అందకుండా మూడు రాష్ట్రాలకు కొత్త ముఖ్యమంత్రులను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కాగా, బుధవారం ఉదయం మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి హాజరయ్యారు. ఆయనతో పాటు హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, గుజరాత్ సీఎం భూపేంద్రభాయ్ పటేల్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 13 , 2023 | 08:41 PM