ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka Elections: జేడీఎస్‌కు ఓటు వేస్తే కాంగ్రెస్‌‍కు ఓటేసినట్టే: అమిత్‌షా

ABN, First Publish Date - 2023-04-25T14:45:09+05:30

కర్ణాటక సర్వతోముఖాభివృద్ధికి, శాంతి, సుస్థిరత కోసం బీజేపీకి ఓటు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగల్‌కోట్: కర్ణాటక సర్వతోముఖాభివృద్ధికి, శాంతి, సుస్థిరత కోసం బీజేపీకి (BJP) ఓటు వేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎన్నడు లేనంత అవినీతి చోటుచేసుకుంటుందని, బుజ్జగింపు రాజకీయాలు, కుటుంబ రాజకీయలు, అల్లర్లు చోటుచేసుకుంటాయని హెచ్చరించారు. జేడీఎస్‌కు ఓటు వేయడమంటే కాంగ్రెస్‌కు ఓటు వేయడమే అవుతుందని బాగల్‌కోట్ మంగళవారంనాడు జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ అన్నారు.

రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఇటీవల బీజీపీ నుంచి ఆ పార్టీలో చేరిన నేతలపై ఆధారపడి పోటీ చేస్తోందని, ఆ పార్టీలో నాయకత్వ లేమి ఉందనే విషయం దీనినిబట్టే స్పష్టమవుతోందని అమిత్‌షా అన్నారు. జేడీఎస్‌కు ఓటు వేస్తే కాంగ్రెస్‌కు ఓటు వేయడమే అవుతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు మీ ఓటు వెళ్లకూడదనుకుంటే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని కాంక్షించే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. బీజేపీ డబుల్ ఇంజన్ ఒకవైపు, రివర్స్ గేర్ కాంగ్రెస్ గవర్న్‌మెంట్ మరోవైపు ఎన్నికల బరిలో ఉన్నాయని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలంటే కేవలం ఎమ్మెల్యేలను ఎన్నుకోవడం కాదని, రాష్ట్ర భవిష్యత్తును ప్రధాని మోదీ చేతిలో ఉంచడమని, కర్ణాటకను అభివృద్ధి పథంలో నడిపి, రాజకీయ సుస్థిరత నెలకొనేలా చేసే ఎన్నికలు ఇవని అమిత్‌షా వివరించారు.

షెట్టార్ పార్టీ ఫిరాయింపుపై బీజేపీ గుస్సా..

కాగా, మాజీ ముఖ్యమత్రి జగదీష్ షెట్టార్ కాంగ్రెస్‌లో చేరడంపై బీజేపీ తీవ్ర అంసతృప్తితో ఉంది. ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనైనా ఓడించాలనే గట్టి పట్టుదలతో ఉంది. ఈ విషయాన్ని అమిత్‌షా సీరియస్‌గా తీసుకున్నారని, ఇందుకు సంబంధించిన పక్కా వ్యూహరచన సాగిస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. హుబ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గంలోని పార్టీ నేతలు, ఆఫీసు బేరర్లతో అమిత్‌షా నేరుగా మాట్లాడి, షెట్టార్‌ను ఓటించేందుకు పూర్తి శక్తియుక్తులు కేంద్రీకరించాలని సూచించినట్టు చెబుతున్నారు. షెట్టార్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఉండే అది వేరే విషయమని, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం క్షమార్హం కాదని అమిత్‌షా అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మే 10న జరుగనుండగా, మే 13న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2023-04-25T14:45:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising