ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Annamali Vs Gautami: మేము గౌతమి వైపే ఉన్నాం...

ABN, First Publish Date - 2023-10-23T21:07:29+05:30

నటి, నేత గౌతమి తాడిమళ్ల బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు కె.అన్నామలై స్పందించారు. ఈ వ్యవహారంలో అవగాహనా లోపం చోటుచేసుకుందని, నిజానికి గౌతమికి పార్టీ బాసటగా ఉందని తెలిపారు.

చెన్నై: నటి, నేత గౌతమి తాడిమళ్ల (Actor Gautami Tadimalla) బీజేపీకి రాజీనామా చేయడంపై ఆ పార్టీ తమిళనాడు విభాగం అధ్యక్షుడు కె.అన్నామలై (K.Annamalai) స్పందించారు. ఈ వ్యవహారంలో అవగాహనా లోపం చోటుచేసుకుందని, నిజానికి గౌతమికి పార్టీ బాసటగా ఉందని తెలిపారు.


ఆస్తి విషయంలో తనను మోసం చేసిన వ్యక్తులకు పార్టీ (బీజేపీ) బాసటగా ఉందని, అలగప్పన్‌ అనే వ్యక్తికి కొందరు బీజేపీ నేతలు సహకరిస్తున్నారని తన రాజీనామా లేఖలో గౌతమి ఆరోపించారు. పార్టీకి దూరం కావడం బాధగా ఉన్న జరుగుతున్న పరిణామాలు తనకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమి రాజీనామా వ్యవహారంపై కొద్ది గంటల్లోనే అన్నామలై స్పందించారు. గౌతమితో తాను ఫోనులో మాట్లాడాడని, సత్వర చర్యకు ఆమె డిమాండ్ చేశారని తెలిపారు. గతంలో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్‌కు ఆమెకు తాము మద్దతుగా నిలిచామని, అయితే నిందితుడిని కాపాడేందుకు కొందరు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారని ఆమె అభిప్రాయపడుతున్నారని తెలిపారు. అయితే బీజేపీ నుంచి ఎవరూ అతనికి సపోర్ట్ చేయడం లేదని తెలిపారు. ఇదే విషయమై గౌతమితో తాను మాట్లాడానని, అవగాహన లోపమే దీనంతటికీ కారణమని చెప్పారు. నిందితుడికి బీజేపీతో ఎలాంటి సంబంధం లేదని ఆయన వివరణ ఇచ్చారు. గౌతమితో 25 ఏళ్లుగా ఆ వ్యక్తి స్నేహితుడిగా ఉన్నాడని, అతను మోసం చేశాడని చెప్పారు. నిజానికి ఇది గౌతమి, అతనికి మధ్య ఉన్న కేసు అని, అయినప్పటికీ తాము గౌతమి వైపే ఉన్నామని అన్నామలై తెలిపారు.

Updated Date - 2023-10-23T21:07:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising