ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Omar Abdullah: సర్జికల్ దాడులపై మా వైఖరి మొదట్నించీ అదే..

ABN, First Publish Date - 2023-01-27T14:24:38+05:30

సర్జికల్ దాడులను తమ పార్టీ ఎన్నడూ ప్రశ్నించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంబన్: సర్జికల్ దాడులను (Surgical Strikes) తమ పార్టీ ఎన్నడూ ప్రశ్నించలేదని నేషనల్ కాన్ఫరెన్స్ (NC)నేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఉన్నారు. బనిహాల్‌లో మీడియాతో శుక్రవారంనాడు ఆయన మాట్లాడుతూ, సర్జికల్ దాడుల వ్యవహారంపై తాము మాట్లాడేదేమీ లేదని, తమ పార్టీ ఎప్పుడూ ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తలేదని చెప్పారు. సర్జికల్ దాడులపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించినప్పుడు, అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారమని సమాధానమిచ్చారు. ''సర్జికల్ దాడులపై తమ వద్ద వీడియో ఉందని ప్రభుత్వం (కేంద్రం) చెబుతోంది. అది చూపించమని దిగ్విజయ్ సింగ్ అడిగితే అందులో తప్పేముంది? మేము సర్జికల్ దాడులకు ఆధారాలు చూపమని అడగం. అయితే తమ వద్ద వీడియో ఉందని చెప్పినందున ప్రభుత్వమే ఆ వీడియో చూపించాలి'' అని ఒమర్ అన్నారు.

దీనికి ముందు, రషీద్ అల్వీ మాట్లాడుతూ, భద్రతా బలగాలపై తమకు నమ్మకం ఉందని, కానీ, బీజేపీ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదని అన్నారు. సర్జికల్ దాడులపై ప్రభుత్వంలోని వివిధ మంత్రులు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ప్రస్తావించారు. ఎవరి ప్రాణాలకు నష్టం లేని చోటు నుంచి సర్జికల్ దాడులు జరిపినట్టు అప్పటి మంత్రి సుష్మాస్వరాజ్ చెప్పారని, వాయిదాడుల్లో 300 మంది చనిపోయారని అమిత్‌షా తెలిపారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ అయితే 400 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు చెబుతున్నారని అన్నారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కోరకంగా ప్రకటనలో చేసినందను ప్రభుత్వం వద్ద ఆధారాలుంటే చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనల వల్ల అసలు ఏమి జరగిందనే దానిపై ప్రశ్నలు తలెత్తడం సహజమన్నారు. వీడియో సాక్షం ఉందని ప్రభుత్వం చెబుతున్నందున దానికి బహిరంగం చేయాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం దగ్గర వీడియో ఆధారం లేకుంటే వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు.

Updated Date - 2023-01-27T14:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising