ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sachin Pilot: జి-20 సక్సెస్‌ను స్వాగతించిన సచిన్ పైలట్

ABN, First Publish Date - 2023-09-11T18:26:51+05:30

దేశ రాజధానిలో ఇండియా అధ్యక్షతన రెండ్రోజుల పాటు జరిగిన జి-20 సదస్సు విజయవంతం కావడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ స్వాగతించారు. అయితే, తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను జి-20 డిన్నర్‌కు ఆహ్వానించి ఉండాల్సిందని అన్నారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇండియా అధ్యక్షతన రెండ్రోజుల పాటు జరిగిన జి-20 సదస్సు (G20 Summit) విజయవంతం కావడాన్ని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ (Sachin Piolt) స్వాగతించారు. అయితే, తమ పార్టీ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను జి-20 డిన్నర్‌కు ఆహ్వానించి ఉండాల్సిందని అన్నారు.


''జి-20 విజయవంతమైన కార్యక్రమం. మేము స్వాగతిస్తున్నాం. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వం సదస్సుకు ఆహ్వానించి ఉండే మరింత బాగుండేది. ఖర్గేను ఆహ్వానించి ఉంటే, దేశం ఐక్యంగా ఉందని యావత్ ప్రపంచం అనుకుని ఉండేది'' అని కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలట్ అన్నారు.


భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ మండపంలో ఆతిథ్యమిచ్చిన జి-20 డిన్నర్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు కొందరు బీజేపీయేతర నేతలను కూడా ఆహ్వానించారు. డిన్నర్‌లో పాల్గొన్ని బీజేపీయేతర నేతల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో పాటు ముఖ్యమంత్రులు హేమంత్ సోరెన్, మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, సుఖ్విందర్ సింగ్ సుఖు హాజరయ్యారు. హిమాచల్ ప్రదేశ్ సీఎం, కాంగ్రెస్ నేత సుఖు సైతం అనూహ్యంగా హాజరయ్యారు. కేరళ సీఎం పినరయి విజయన్, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం చంద్రశేఖర రావు విందు ఆహ్వానాన్ని తిరస్కరించారు.

Updated Date - 2023-09-11T18:30:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising