ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bharat India: ఇంతకీ ‘ఇండియా’నా లేక భారతా?.. మన రాజ్యాంగం ఏం చెబుతుందో తెలుసా...

ABN, First Publish Date - 2023-09-05T15:56:18+05:30

ఇంతకీ మన దేశం పేరు ‘ఇండియా’నా లేక ‘భారత్’ ఆ జీ20 సదస్సు (G20 Summit) డిన్నర్ ఆహ్వానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిన్నర్ ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా పేర్కొనడమే ఇందుకు కారణమైంది. ఇండియా పేరును భారత్‌గా మార్చబోతున్నారంటూ విపక్షాల నేతలు దేశవ్యాప్తంగా మండిపడుతున్నారు.

న్యూఢిల్లీ: ఇంతకీ మన దేశం పేరు ‘ఇండియా’నా లేక ‘భారత్’ ఆ జీ20 సదస్సు (G20 Summit) డిన్నర్ ఆహ్వానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. డిన్నర్ ఆహ్వానంలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులు ‘ది ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’గా పేర్కొనడమే ఇందుకు కారణమైంది. ఇండియా పేరును భారత్‌గా మార్చబోతున్నారంటూ విపక్షాల నేతలు దేశవ్యాప్తంగా మండిపడుతున్నారు. పేరు మార్చాల్సిన అవసరం ఏముందంటూ నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ సర్కారును ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశం పేరు గురించి మన రాజ్యాంగం, సుప్రీంకోర్ట్ ఏం చెబుతున్నాయో ఒకసారి గమనిద్దాం...

‘‘ ఇండియా.. అంటే భారత్.. రాష్ట్రాల సమాఖ్య’’ అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 చెబుతోంది. రాజ్యాంగం గుర్తించిన ‘ఇండియా’, ‘భారత్’ పదాలు రెండూ దేశానికి అధికారిక పేర్లేనని చెప్పేందుకు ఆర్టికల్ 1ని బట్టి చెప్పొచ్చు. అయితే రాజ్యాంగం నుంచి ఇండియా అనే పేరుని తొలగించి కేవలం భారత్ అనే పేరును మాత్రమే ఉంచాలని భావిస్తోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


మరి సుప్రీంకోర్ట్ చెప్పిందేంటి?

దేశం పేరును ఇండియా నుంచి భారత్‌గా మార్చాలంటూ మార్చి 2016లో దాఖలైన ఒక పిల్‌పై సుప్రీంకోర్ట్ తీవ్రంగా స్పందించింది. సదరు పిటిషన్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వ్యాజ్యాన్ని కొట్టిపారేసింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ ఠాకూర్‌, జస్టిస్‌ యూయూ లలిత్‌లతో కూడిన ధర్మాసనం అలాంటి పిటిషన్లను విచారించబోమని పిటిషనర్‌కు స్పష్టంగా తెలిపింది. “ఇండియా లేదా భారత్ ? మీరు ఈ దేశాన్ని ఎలా పిలవాలనుకుంటే అలా ముందుకుసాగండి. ఎవరైనా దీన్ని ఇండియా అని పిలవాలనుకుంటున్నారు, వారు దానిని ఇండియా అని పిలవనివ్వండి" అని జస్టిస్ ఠాకూర్ ఆ సమయంలో అన్నారు.

నాలుగేళ్లక్రితం 2020 సంవత్సరంలో కూడా ఇదే తరహా పిటిషన్‌ను సుప్రీంకోర్ట్ తోసిపుచ్చింది. పిటిషన్‌ను అభ్యర్థనగా మార్చుకుని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయవచ్చునని సూచించింది. “భారత్, ఇండియా రెండూ రాజ్యాంగంలో ఉన్న పేర్లు. దేశాన్ని ఇప్పటికే రాజ్యాంగంలో ‘భారత్’ అని పిలుస్తారు’’ అని నాటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బాబ్డే వ్యాఖ్యానించారు.


రాజ్యాంగాన్ని ఎలా సవరించొచ్చు?

కేంద్ర సర్కారు ఒకవేళ ‘భారత్‌’ అనే పేరును మాత్రమే అధికారికంగా మార్చాలనుకుంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 1ని సవరించేందుకు పార్లమెంటులో బిల్లును తీసుకురావాల్సి ఉంటుంది. ఆర్టికల్ 368 అనుగుణంగా సాధారణ మెజారిటీ సవరణ లేదా ప్రత్యేక మెజారిటీ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరించే వీలుంటుంది. అయితే కొత్త రాష్ట్రం ఏర్పాటు లేదా రాజ్యసభలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు వంటి రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ సవరణలకు హాజరైన మొత్తం సభ్యుల సంఖ్యలో సాధారణ మెజారిటీ (అంటే 50 శాతం కంటే ఎక్కువ) అవసరం ఉంటుంది. ఇక ఆర్టికల్ 1 వంటి ప్రత్యేక సవరణ కోసం సభకు హాజరైన సభ్యుల్లో మూడింట రెండొంతుల తక్కువ కాకుండా ప్రత్యేక మెజారిటీ (66 శాతం) అవసరం ఉంటుంది.

Updated Date - 2023-09-05T16:38:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising