ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amritpal Singh Escape: పంజాబ్‌ పోలీసుల ఇంటెలిజెన్స్ వైఫల్యంపై కోర్టు తీవ్ర ఆగ్రహం

ABN, First Publish Date - 2023-03-21T15:36:21+05:30

ఖలిస్థాన్ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ పంజాబ్ పోలీసుల కన్నుగప్పి పారిపోవడంపై...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

చండీగఢ్: ఖలిస్థాన్ నాయకుడు అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh) పంజాబ్ పోలీసుల కన్నుగప్పి పారిపోవడంపై పంజాబ్- హర్యానా హైకోర్టు (Punjab And Haryana High Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి స్థాయీ నివేదకను (Status Report) తమకు సమర్పించాలని పంజాబ్ పోలీసులను ఆదేశించింది.

''80,000 మంది పోలీసులు ఉన్నారు. వీరంతా ఏం చేస్తున్నట్టు? అమృత్‌పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు?'' అని పంజాబ్ ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. ఇది రాష్ట్ర పోలీసుల ఇంటెలిజెన్స్ వైఫల్యమైనని తప్పుపట్టింది. అమృత్‌పాల్ సింగ్, అతను స్థాపించిన 'వారిస్ పంజాబ్ దే' (Waris Punjab De) సభ్యులపై పోలీసు చర్య నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అమృత్‌పాల్‌ను పట్టుకునేందుకు శనివారంనాడు పెద్దఎత్తున పోలీస్ ఆపరేషన్ చేపట్టామని, అతని సహచరులను 120 మందిని అదుపులో తీసుకున్నామని పోలీసులు కోర్టుకు వివరణ ఇచ్చారు.

ఘటనల క్రమం...

జలంధర్‌లోని షాకోట్‌ తహసిల్‌కు తన కాన్వాయితో అమృత్‌పాల్ వెళుతున్నట్టు సమాచారం అందుకున్న రాష్ట్ర పోలీసులు కేంద్ర బలగాల సహకారంతో శనివారంనాడు అతన్ని అరెస్టు చేసేందుకు పథకం వేశారు. పోలీసులు అతని వాహనాన్ని 25 కిలోమీటర్లు వెంబడించారు. అయితే, ఇరుకు రోడ్లు, రద్దీలో అతను తప్పించుకున్నాడని, ఈ ఆపరేషన్‌లో ప్రజలకు ఎలాంటి హాని జరగ కూడదని ముందే నిర్ణయం తీసుకున్నామని పంజాబ్ పోలీసులు చెబుతున్నారు. అతనొక ఖలిస్థానీ-పాకిస్థాన్ ఏజెంట్ అని ప్రభుత్వం చెబుతోంది. కాగా, శనివారం సాయంత్రం జలంధర్‌లో మోటార్‌సైకిల్‌పై వేగంగా వెళ్తుండటం చివరిసారిగా చూసినట్టు మరికొందరు చెబుతున్నారు.

పంజాబ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా చురుకుగా పనిచేస్తున్న అమృత్‌పాల్ ఆయుధాలు పట్టుకున్న మద్దుతుదారుల ఎస్కార్ట్‌తో తరచుగా కనిపించేవాడు. ఖలిస్థాన్ వేర్పాటువాది, ఉగ్రవాది జర్నైల్ సింగ్ బ్రిందన్‌వాలే అనుచరుడుగా అతన్ని చెబుతారు. 'బ్రిందన్‌వాలే-2' గా అతనిని మద్దతుదారులు అభివర్ణిస్తుంటారు.

సీఎం వార్నింగ్...

కాగా, అమృత్‌పాల్ సింగ్, అతని సహచరులపై తీసుకున్న పోలీసు చర్యపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ మంగళవారంనాడు తొలిసారిగా స్పందించారు. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే ఏ శక్తులను విడిచిపెట్టేది లేదని, పంజాబ్ ప్రజలు శాంతి, ప్రగతిని కోరుకుంటున్నారని అన్నారు. ఖలిస్థాన్ నేతను పట్టుకునేందుకు ఆపరేషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇంతవరకూ ఎలాంటి హింసాత్మక ఘటన చోటుచేసుకోలేదని చెప్పారు. అమృత్‌పాల్‌కు సన్నిహితుడైన తూఫాన్‌ సింగ్‌ అరెస్టుకు వ్యతిరేకంగా గత నెలలో అజ్‌నాలా పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిగినప్పటి నుంచి పంజాబ్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Updated Date - 2023-03-21T15:36:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising