Delhi Mayor: షెల్లీ ఒబెరాయ్ ఎవరో తెలుసా..?
ABN, First Publish Date - 2023-02-22T15:23:43+05:30
ఢిల్లీ మేయర్ ఎన్నికల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడి...ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ మేయర్ పీఠాన్ని కైవసం..
న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్ ఎన్నికల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడి...ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మహిళా అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ (Shelly Oberoi) మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బుధవారంనాడు హోరాహోరీగా జరిగిన మేయర్ ఎన్నికల్లో (Mayor Election) షెల్లీ ఒబెరాయ్ బీజేపీ మహిళా అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్‌కి 150 ఓట్లు రాగా, రేఖా గుప్తా 116 ఓట్లు సాధించారు.ఢిల్లీ ఈస్ట్ పటేల్ నగర్ వార్డ్ నుంచి తొలిసారి కౌన్సిలర్‌గా ఎన్నికైన ఒబెరాయ్ ఎకాఎకీన మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
షెల్లీ ఒబెరాయ్ ప్రస్థానం...
-గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఎంసీడీ మున్సిపల్ ఎన్నికల్లో 86వ నెంబర్ వార్డు నుంచి కౌన్సిలర్‌గా షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు.
-ఢిల్లీ యూనివర్శిటీలో ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
-39 ఏళ్ల షెల్లీ ఒబెరాయ్ ఇండియన్ కామర్స్ అసోసియేషన్ (ఐసీఏ) లైఫ్‌టైమ్ సభ్యురాలిగా కూడా ఉన్నారు.
- వివిధ కాన్ఫరెన్స్‌లలో పలు అవార్డులను కూడా గెలుచుకున్నారు.
-ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీస్‌లో ఫిలాసపీలో ఆమె డాక్టర్ పట్టా తీసుకున్నారు.
-కాలేజీలో అత్యధిక గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ సాధించినందుకు స్కాలర్‌షిప్‌తో పాటు, 'మిస్ కమ్లా రాణి' ప్రైజ్‌ను కూడా ఆమె సొంతం చేసుకున్నారు.
-హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీలో కామర్స్‌లో మాస్టర్ డిగ్రీ తీసుకున్నారు.
-2013లో ఆమె 'ఆమ్ ఆద్మీ పార్టీ'లో చేరడం ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేశారు.
-ఢిల్లీ ఆప్ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమితులయ్యారు.
- ఎంసీడీ మేయర్ ఎన్నికలు సకాలంలో జరపాలంటూ జనవరి 26న ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారు.
Updated Date - 2023-02-22T18:45:14+05:30 IST