ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AAP Minsters Quit: సిసోడియా ప్లేస్‌లో ఎవరు? రాజీనామాల ఆమోదానికి కారణం ఏమిటి?

ABN, First Publish Date - 2023-02-28T20:34:03+05:30

మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయి సీబీఐ కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియా, ఇదే కేసులో ఇంతకుముందే జైలుకు వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: మద్యం పాలసీ కుంభకోణం కేసులో (Delhi Excise Policy Case) అరెస్టయి సీబీఐ కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియా, ఇదే కేసులో ఇంతకుముందే జైలుకు వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendar Jain) అనూహ్యంగా సోమవారం రాజీనామా చేయడం, వారి రాజీనామాలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమోదించడం వంటి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మనీస్ సిసోడియా చేతులో ఉన్న శాఖల బాధ్యత ఎవరికి కేటాయిస్తారు? ఉప ముఖ్యమంత్రి బాధ్యత ఎవరికి అప్పగించవచ్చనే ఆసక్తికరమైన చర్చ మొదలైంది.

ఆప్ వర్గాల కథనం ప్రకారం, సిసోడియా, సత్యేంద్ర జైన్ స్థానంలో కొత్త మంత్రులను ఎవరూ తీసుకోరని తెలుస్తోంది. సిసోడియా చేతిలో ఉన్న శాఖల బాధ్యతను ఆప్ నేతలకే అప్పగించబోతున్నారు. అప్ నేతలు రాజ్‌కుమార్ ఆనంద్, కైలాష్ గెహ్లాట్‌లకు ఈ బాధ్యతలను అప్పగించనున్నట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి పదవిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, రాజ్‌కుమార్ ఆనంద్, కైలాష్ గెహ్లాట్‌లలో ఎవరో ఒకరికి అప్పగించవచ్చని చెబుతున్నారు.

కాగా, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతోనే సిసోడియా, సత్యేంద్ర జైన్ రాజీనామాలను కేజ్రీవాల్ ఆమోదించినట్టు ఆప్ నేత సంజయ్ సింగ్ తెలిపారు. బీజేపీ దిగజారుడు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతున్నారని అన్నారు.

Updated Date - 2023-02-28T20:34:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!