ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gujarat High court: విచ్చలవిడి పశువుల బలిపై గుజరాత్ హైకోర్టు సీరియస్

ABN, First Publish Date - 2023-12-13T19:35:16+05:30

ప్రజల సౌలభ్యం కోసం అమాయక జంతువులను బలి ఇవ్వలేమని, అందుకు అనుమతించేది లేదని గుజరాత్ హైకోర్టు బుధవారంనాడు తెలిపింది. నిర్బంధించిన పశువుల మరణాలపై సీరియస్ అయింది. ఖేడ జిల్లా నడియాడ్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో పశువుల కళేబరాలు పడి ఉండటం దిగ్భ్రాంతి కలిగిస్తోందని న్యాయమూర్తులు అశుతోష్ శాస్త్రి, హేమంత్ ప్రచ్ఛక్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

అహ్మదాబాద్: ప్రజల సౌలభ్యం కోసం అమాయక జంతువులను బలి ఇవ్వలేమని, అందుకు అనుమతించేది లేదని గుజరాత్ హైకోర్టు (Gujarat High court) బుధవారంనాడు తెలిపింది. నిర్బంధించిన పశువుల మరణాలపై సీరియస్ అయింది. ఖేడ జిల్లా నడియాడ్ ఏరియాలోని పలు ప్రాంతాల్లో పశువుల కళేబరాలు పడి ఉండటం దిగ్భ్రాంతి కలిగిస్తోందని న్యాయమూర్తులు అశుతోష్ శాస్త్రి, హేమంత్ ప్రచ్ఛక్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.


నడియాడ్‌లోని వివిధ ప్రాంతాల్లో సుమారు 30 పశు కళేబరాలు బహిరంగంగా పడేసిన ఫోటోలను అడ్వకేట్ అమిత్ పాంచాల్ న్యాయమూర్తుల దృష్టికి తీసుకువచ్చారు. నడియాడ్ నగరపాలిక సంస్థ రాష్ట్ర ప్రభుత్వ విధానం కింద 110 పశువులను నిర్బంధించిందని, ఇప్పుడు కేవలం 80 నుంచి 90 మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన తెలిపారు. ఒక స్థానిక సామాజిక కార్యకర్త తరఫున దాఖలు చేసిన అఫిడవిట్‌పై ఆయన తన వాదనలు వినిపించారు. దీనిపై ధర్మాసనం ఘాటుగా స్పందించింది.


''బహిరంగ ప్రదేశంలో పడేసిన ఆవుల కళేబరాలు చాలా దిగ్భ్రాంతి కలిగించేలా ఉన్నాయి. కలవరపెడుతున్నాయి. ఒక విధానాన్ని అమలు చేయడమనే ముసుగులో అమాయక జంతువులను బలి ఇవ్వలేమని మేము భావిస్తున్నాం. మానవ జీవితాల సౌలభ్యం కోసం మేము ఇలాంటి వాటిని అనుమతించ లేము'' అని ధర్మాసనం వ్యాఖ్యానించారు. దీనిపై ఖేడ కలెక్టర్ తక్షణం విచారణ జరిపి, రాష్ట్ర వ్యాప్తంగా పశువుల పౌండ్స్ ఎన్ని ఉన్నాయి, వాటి సామర్థ్యం ఎంత, ఈరోజు వరకూ ఎన్ని పశువులు అందులో ఉన్నాయి వంటి వివరాలతో నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.


కాగా, పశు కళేబరాలు చాలా పాతవని ప్రభుత్వం తరఫు న్యాయవాది మనీషా లువ్‌కుమార్ షా కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రాథమిక విచారణ కొనసాగుతోందని, అధికారులు సైతం పశు కళేబరాలు చాలా పాతవనే ప్రాథమిక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని చెప్పారు. అయితే తాము ఆ కళేబరాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని, రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని కోర్టుకు వివరించారు. తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 19వ తేదీకి వాయిదా వేసింది.

Updated Date - 2023-12-13T19:35:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising