New Parliament : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-05-28T15:56:06+05:30
నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ చరిత్రాత్మక ఘట్టాన్ని కనులారా చూసే సౌభాగ్యం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ చరిత్రాత్మక ఘట్టాన్ని కనులారా చూసే సౌభాగ్యం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ అన్నారు. మన ప్రజాస్వామిక వారసత్వం, ఆచార, సంప్రదాయాలు, విలువలు మన విదేశాంగ విధానంలో ముఖ్యాంశాలని తెలిపారు. నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanyam Jaishankar) ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశ నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని చూడటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఇది చరిత్రాత్మక ఘట్టమని తెలిపారు. స్వయం సమృద్ధ భారత దేశం, మన ప్రజాస్వామిక వారసత్వం, ఆచార, సంప్రదాయాలు, విలువలు, ఆకాంక్షలు విస్పష్టంగా ప్రకటిస్తున్నది ఇదేనన్నారు. మన ప్రజాస్వామిక వారసత్వం, ఆచారాలు, విలువలు మన విదేశాంగ విధానంలో కీలకమైనవన్నారు. గొప్ప అంతర్జాతీయ కార్యకలాపాలకు శక్తిమంతమైన వేదికగా ఈ నూతన పార్లమెంటు నిలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.
నూతన పార్లమెంటు భవనాన్ని మోదీ ఆదివారం వేద మంత్రాలు, హోమాలు, పూజలతో ప్రారంభించారు. అత్యంత పవిత్రమైన ధర్మదండం (సెంగోల్)ను లోక్‌సభలో ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలను కూడా నిర్వహించారు.
మోదీ నూతన పార్లమెంటులో మాట్లాడుతూ, 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ఈ నూతన భవనం చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఇది స్వయం సమృద్ధ భారత దేశానికి నాంది అని తెలిపారు. అభివృద్ధి చెందిన భారత దేశంవైపు మన ప్రస్థానానికి ఇది సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. అంతేకాకుండా ఎంపీలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
New Parliament : సాధికారతను సంరక్షించే చోటు.. నూతన పార్లమెంటు భవనంపై మోదీ వ్యాఖ్య..
New Parliament : బాలీవుడ్ సెలబ్రిటీల ట్వీట్లను రీట్వీట్ చేసిన మోదీ
Updated Date - 2023-05-28T15:56:06+05:30 IST