ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court : మహిళ అంటే ఇంట్లో సామాను కాదు : సుప్రీంకోర్టు

ABN, First Publish Date - 2023-01-14T11:23:47+05:30

మహిళలకు తమకంటూ ఓ గుర్తింపు ఉందని, వారు ఇంట్లో వాడుకునే వస్తువులు, సామన్లు కాదని సుప్రీంకోర్టు

Supreme Court
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : మహిళలకు తమకంటూ ఓ గుర్తింపు ఉందని, వారు ఇంట్లో వాడుకునే వస్తువులు, సామన్లు కాదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. వివాహం తర్వాత గుర్తింపు మారిపోదని తెలిపింది. సిక్కిం (Sikkim) రాష్ట్రానికి చెందని పురుషులను పెళ్లి చేసుకునే సిక్కిం మహిళలకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10(26ఏఏఏ) ప్రకారం మినహాయింపు వర్తించబోదని చెప్తున్న నిబంధన వివక్షాపూరితమైనదని తీర్పు చెప్పింది. ఈ నిబంధనను రద్దు చేసింది.

కేవలం సిక్కిమేతర పురుషుడిని పెళ్లి చేసుకున్నందుకు సిక్కిం మహిళను వేరుగా చూడటం పూర్తిగా వివక్షాపూరితమని తెలిపింది. మహిళ అంటే ఇంట్లో వాడుకునే సామాను కాదని, ఆమెకు తనదైన గుర్తింపు ఉందని, వివాహం వల్ల ఆ గుర్తింపు రద్దు కాబోదని పేర్కొంది. జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది.

2008 ఏప్రిల్ 1 తర్వాత సిక్కిమేతర మహిళను పెళ్లి చేసుకున్న సిక్కిం పురుషులు ఈ మినహాయింపును పొందేందుకు అర్హతను కోల్పోవడం లేదనే విషయాన్ని ధర్మాసనం గమనించింది.

సిక్కిం 1975 ఏప్రిల్ 26న భారత దేశంలో విలీనం అయింది. ఈ తేదీనాటికి సిక్కింలో నివసిస్తున్న భారతీయ మూలాలుగలవారికి కూడా ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(26ఏఏఏ) ప్రకారం మినహాయింపు వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అంటే సిక్కిం జనాభాలో దాదాపు 95 శాతం మందికి ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుందన్నమాట.

సిక్కిం సబ్జెక్ట్స్ సర్టిఫికేట్ కలిగియున్నవారికి లేదా వారి వారసులు సిక్కిం పౌరసత్వ సవరణ ఉత్తర్వు, 1989 ప్రకారం భారత పౌరులుగా మారినపుడు మాత్రమే గతంలో ఆదాయపు పన్ను మినహాయింపు లభించేది. ఈ రెండు వర్గాల్లోకి భూటియా లెప్చాస్, షెర్పాస్, నేపాలీస్ వస్తారు. సిక్కిం జనాభాలో వీరు 94.6 శాతం మంది ఉంటారు. భారత దేశంలో సిక్కిం విలీనమైన తేదీ నాటికి సిక్కింలో నివసిస్తున్నవారు కోర్టును ఆశ్రయించారు. వీరు రాష్ట్ర జనాభాలో 1 శాతం మాత్రమే ఉన్నారు.

Updated Date - 2023-01-14T11:23:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising