ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pune: దుబాయ్ తీసుకెళ్లలేదని.. భర్త ముక్కు, పళ్లపై పిడిగుద్దులు కురిపించిన భార్య... దెబ్బలు తాళలేక బాధితుడు మృతి

ABN, First Publish Date - 2023-11-25T12:15:33+05:30

మహారాష్ట్రలోని పుణె(Pune)కు చెందిన నిఖిల్(36) ఓ వ్యాపారవేత్త. ఆయన రేణుక అనే మహిళతో 6 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పుణెలోని వానావడి ప్రాంతంలోని రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్నారు. భార్య రేణుక పుట్టిన రోజు కావడంతో ఆమె దుబాయి తీసుకెళ్లాలని, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని నిఖిల్ ని అడిగింది.

పుణె: భార్యభర్తల వివాహ దినోత్సవాలు, పుట్టిన రోజు వేడుకలు ఇలా ఏవైనా ప్రత్యేకమే. ఎవరి పుట్టినరోజు ఉన్నా.. మరొకరు వారికి నచ్చిన పనులు చేయడం సాధారణమే. కానీ నచ్చిన పని చేయలేదని ఓ భార్య ఏం చేసిందో చదివితే షాక్ తింటారు. మహారాష్ట్రలోని పుణె(Pune)కు చెందిన నిఖిల్(36) వ్యాపారవేత్త. ఆయన రేణుకను 6 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. పుణెలోని వానావడి ప్రాంతంలోని రెసిడెన్షియల్ సొసైటీలో నివసిస్తున్నారు.

భార్య రేణుక పుట్టిన రోజు కావడంతో ఆమె దుబాయి తీసుకెళ్లాలని, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని నిఖిల్ ని అడిగింది. పనులు ఉన్న కారణంగా ఇప్పుడు కుదరదని నిఖిల్ చెప్పడంతో రేణుక ఆగ్రహానికి గురయింది. ఈ విషయంపై అదే రోజు ఇరువురు వాగ్వాదానికి దిగారు. అనంతరం రేణుక.. తన భర్త ముక్కు, పళ్లపై పిడి గుద్దులు కురిపించింది. తీవ్ర గాయాలపాలైన నిఖిల్ అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ససూన్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

రేణుకను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఆమె మద్యం సేవించి, బలమైన వస్తువుతో భర్తపై దాడి చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-25T12:23:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising