World Bank : భారత్ వృద్ధి రేటుపై ప్రపంచ బ్యాంక్ షాక్
ABN, First Publish Date - 2023-04-04T16:32:45+05:30
భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు
న్యూఢిల్లీ : భారత దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6.3 శాతం ఉంటుందని ప్రపంచ బ్యాంకు (World Bank) అంచనా వేసింది. అంతకుముందు ఇది 6.6 శాతం అని అంచనా వేసిన సంగతి తెలిసిందే. తాజా నివేదికలో జీడీపీ వృద్ధి రేటు అంచనా స్వల్పంగా తగ్గింది.
భారత దేశ అభివృద్ధి తాజా అంచనాలను ప్రపంచ బ్యాంకు మంగళవారం విడుదల చేసింది. వినియోగ వృద్ధి మందగించడం, బాహ్య పరిస్థితులు భారత దేశ జీడీపీ వృద్ధి రేటు తగ్గడానికి కారణాలయ్యే అవకాశం ఉందని తెలిపింది. రుణాలపై వడ్డీ రేట్లు పెరుగుతుండటం, ఆదాయంలో వృద్ధి మందగించడం వల్ల ప్రైవేటు వినియోగ వృద్ధి తగ్గే అవకాశం ఉందని తెలిపింది. అదేవిధంగా ప్రభుత్వ వినయోగం కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది. కోవిడ్ మహమ్మారి సంబంధిత ఆర్థిక సహాయక చర్యలను ప్రభుత్వం ఉపసంహరించిందని, దీని ప్రభావం కూడా జీడీపీ వృద్ధి మందగించడానికి కారణం కావచ్చునని అంచనా వేసినట్లు పేర్కొంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ లోటు 3 శాతం ఉందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇది 2.1 శాతం ఉండవచ్చునని తెలిపింది. అదేవిధంగా ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.6 శాతం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరానికి 5.2 శాతానికి తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Karnataka assembly polls: కర్ణాటకలో బీజేపీ గెలిచి తీరాల్సిందే... ఎందుకంటే?
Karnataka Congress : కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్ధూ, డీకే వర్గాల పోటాపోటీ
Updated Date - 2023-04-04T16:32:45+05:30 IST