ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi in Metro: మెట్రోలో ప్రయాణించిన మోదీ.. ప్రయాణికులతో సరదాగా గడిపిన ప్రధాని

ABN, First Publish Date - 2023-09-17T12:25:28+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఢిల్లీ(Delhi)లోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (IICC) యశోభూమి(Yasho Bhumi) మొదటి దశను ప్రారంభించేందుకు వెళుతూ మెట్రో(Metro Train) రైడ్ చేశారు. ప్రయాణికులు ప్రధానిని చూసి ఆశ్చర్యపోయారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఢిల్లీ(Delhi)లోని ద్వారకలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (IICC) యశోభూమి(Yasho Bhumi) మొదటి దశను ప్రారంభించేందుకు వెళుతూ మెట్రో(Metro Train) రైడ్ చేశారు. ప్రయాణికులు ప్రధానిని చూసి ఆశ్చర్యపోయారు. అనంతరం ఆయన వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. పలువురు మోదీతో సెల్పీలు దిగారు. అనంతరం ద్వారకా సెక్టార్ 21 నుంచి యశోభూమి ద్వారకా సెక్టార్ 25 వరకు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రో(Airport Metro) ఎక్స్‌ప్రెస్ లైన్ పొడిగింపును ప్రారంభించారు.


అంతర్జాతీయ సదస్సులు, సమావేశాల కోసం విశాలవంతమైన వసతులతో కూడిన సమావేశ మందిరాన్ని సాకారం చేయడంలో భాగంగా ప్రధాని యశోభూమి అనే సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. దీనిని 8.9 లక్షల చదరపు మీటర్ల బిల్టప్ ఏరియాతో ప్రపంచంలోనే అత్యంత సౌకర్యవంతమైన మీటింగ్ హాల్(Meeting Hall) గా రూపొందించనున్నారు. ఒకే సారి 11 వేల మంది ప్రతినిధులు ఇందులో కూర్చొని మీటింగ్ లో పాల్గొనవచ్చు. ప్రధాన ఆడిటోరియం(Auditorium) కన్వెన్షన్ సెంటర్ కోసం ఏర్పాటు చేయనున్న ప్లీనరీ హాల్ దాదాపు 6,000 మంది అతిథులు కూర్చునే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇంకా ఎన్నో ఫెసిలిటీస్ తో అత్యంత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-09-17T12:30:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising