ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Youtube: యూట్యూబ్ పేరుతో లింక్.. టచ్ చేశారో జేబుకు చిల్లే

ABN, First Publish Date - 2023-05-12T10:38:48+05:30

నగరంలో ఆన్‌లైన్‌(Online) మోసాలు కొత్త రూపు సంతరించుకుంటున్న్నాయి. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ మోసగాళ్లు వివిధ రకాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, (ఆంధ్రజ్యోతి): నగరంలో ఆన్‌లైన్‌(Online) మోసాలు కొత్త రూపు సంతరించుకుంటున్న్నాయి. ఇప్పటి వరకు ఆన్‌లైన్‌ మోసగాళ్లు వివిధ రకాల లింక్‌లు పంపి వాటిని లైక్‌ చేస్తే చాలు కోట్లు సంపాదించవచ్చని ఆకర్షణీయమైన ప్రకటనలు చేసి ప్రజలను మోసగిస్తూ వచ్చారు. తాజాగా యూట్యూబ్‌(Youtube) లింక్‌లు పంపి నగరవాసులను మోసగిస్తున్నారు. పక్షం రోజులుగా నగరానికి చెందిన పలువురు ఆ లింక్‌లను టచ్‌చేసి కోట్లాది రూపాయలు నష్టపోయినట్లు సైబర్‌ క్రైం విభాగం పోలీసులు తెలిపారు. నగరానికి చెందిన 35 మంది సుమారు రూ.5 కోట్ల మేర మోసపోయారు. ఆన్‌లైన్‌ మోసగాళ్లు ముందుగా యూట్యూబ్‌ ఛానెల్‌ పేరుతో ఓ లింక్‌ పంపుతారు. దానిని లైక్‌ చేసే వారి ఖాతాల్లో రూ.500ల నుండి రూ.1000ల దాకా జమ అవుతుందని ఊరిస్తారు. ఆ ప్రకటన నమ్మి పలువురు లింక్‌కు లైక్‌ కొట్టారు. వారి ఖాతాల్లో డబ్బు జమకావటంతో సంబరపడ్డారు. ఆ తర్వాత మోసగాళ్లు ప్రైవేటుగా టెలిగ్రామ్‌ గ్రూపులో చేరితే టీమ్‌ లీడర్‌గా చేస్తామంటూ ఊరిస్తారు. టెలిగ్రామ్‌ గ్రూపు ద్వారా ఓ బ్యాంక్‌ ఖాతా వివరాలు పంపి, ఆ ఖాతాలో డబ్బులు జమచేస్తే రెట్టింపు సొమ్ము వస్తుందని ప్రకటిస్తారు. దీంతో నగరవాసులు పోటీపడి ఆ ఖాతాకు డబ్బులు పంపి మోసపోయారు. తొలుత యూట్యూబ్‌ లింక్‌ లైక్‌ చేసినప్పుడు సక్రమంగా డబ్బులు పంపారనే నమ్మకంతో ఈ టెలిగ్రామ్‌ గ్రూపు ద్వారా కూడా మాట ప్రకారం సొమ్ము రెట్టింపు చేస్తారని, అధికవడ్డీ వస్తుందని ఆశపడి నగరవాసులు పోటీపడి టెలిగ్రామ్‌ గ్రూప్‌ ద్వారా తెలిపిన ఖాతాల్లో డబ్బులు జమచేశారు. ఇలా డబ్బులు జమ చేసినవారిలో నగరానికి చెందిన పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు కూడా ఉన్నారు. వీరంతా లక్ష నుండి పది లక్షల వరకు జమచేసి మోసపోయా రు. ఇలా మోసపోయినవారంతా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి జంకుతున్నారని సైబర్‌ర

విదేశీ వీడియోకాల్స్‌పై జాగ్రత్త...

అందమైన అమ్మాయిల ఫొటోలతో వచ్చే విదేశీ వీడియోకాల్ప్‌పై నగరవాసులు అప్రమత్తంగా వ్యవహరించాలంటూ సైబర్‌ క్రైం అధికారులు హెచ్చరించారు. వియత్నాం, మొరాకో, ఇండోనేషియా వంటి దేశాల నుంచి అందమైన అమ్మాయిల ఫొటోలు, వీడియోలతో వీడియో కాల్స్‌ వస్తే వాటి జోలికి వెళ్లకూడదన్నారు. ఈ కాల్స్‌ను అటెండ్‌ చేస్తే నగ్నంగా ఉన్న అమ్మాయిల వీడియోలు మొబైల్‌ ఫోన్‌ తెరపై ప్రసారమవుతాయని, ఆ తరువాత ఆ వీడియో కాల్‌ అటెండ్‌ చేసిన వారి వీడియోతో మార్ఫింగ్‌ చేసి రకరకాల వెబ్‌సైట్లలో పెట్టడంతో పాటు బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నట్లు పోలీసులకు వరుసగా ఫిర్యాదులు అందుతున్నాయి. అందువల్ల ఇలాంటి వారితో అప్రమత్తంగా వ్యవహరించాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-05-12T10:38:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising