ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mizoram: మిజోరంలో కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకారం

ABN, First Publish Date - 2023-12-08T20:03:18+05:30

మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) నేత 73 ఏళ్ల లాల్‌దుహోమా (Lalduhoma) శుక్రవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు జడ్‌పీఎం నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.

ఐజ్వాల్: మిజోరం (Mizoram) కొత్త ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ (ZPM) నేత 73 ఏళ్ల లాల్‌దుహోమా (Lalduhoma) శుక్రవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు జడ్‌పీఎం నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఐజ్వాల్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యాక్రమంలో వీరిచేత గవర్నర్ హరిబాబు కంభంపాటి ప్రమాణస్వీకారం చేయించారు. మిజోరంలో ఎఎంఎన్, కాంగ్రెస్సేతర ప్రభుత్వం కొలువుదీరడం ఇదే మొదటిసారి.


జడ్‌పీఎం నుంచి నలుగురు సహాయక మంత్రులుగా, ఏడుగురు క్యాబినెట్ మంత్రులుగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి లాల్‌దుహోమా ఆర్థిక, ప్రణాళికలు, పథకాల అమలు, విజిలెన్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ అండ్ కాబినెట్, లా అండ్ జ్యుడిషియల్ శాఖలను తనవద్ద ఉంచుకున్నారు. మంత్రి కె.సప్దాంగకు హోం శాఖ, పట్టణాభివృద్ధి, పోవర్టీ ఎలివేషన్, సిబ్బంది వ్యవహారాలు అడ్మినిస్ట్రేటివ్ సంస్కరణలు, డిజాస్టర్ మేనేజిమెంట్ అండ్ రిహాబిలేషన్ శాఖలను కేటాయించారు. ఇటీవల జరిగిన మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో 40 అసెంబ్లీ స్థానాలకు గాను 27 స్థానాలకు జడ్‌పీఎం గెలుచుకుంది. జడ్‌పీఎం లెజిస్లేచర్ పార్టీ నేతగా లాల్‌దుహోమా మంగళవారంనాడు ఎన్నిక కాగా, కె.సప్దాంగ డిప్యూటీ లీడర్‌గా ఎన్నికయ్యారు. మిజోరంలో ఎఎంఎన్, కాంగ్రెస్సేతర ప్రభుత్వం కొలువుదీరడం ఇదే మొదటిసారి.

Updated Date - 2023-12-08T20:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising