ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కళకు మరణం లేదు

ABN, First Publish Date - 2023-02-04T04:55:54+05:30

కె. విశ్వనాథ్‌ సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ, ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో వారు తీసిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కె. విశ్వనాథ్‌ సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ, ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో వారు తీసిన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. సినీ రంగంలో ఆయనో దిగ్గజం.

- ప్రధాని మోదీ

అతి సామాన్యమైన కథను కూడా తన అద్భుత ప్రతిభతో వెండితెర దృశ్యకావ్యంగా మలిచే అరుదైన దర్శకులు కె. విశ్వనాథ్‌. తన సినిమాల్లో భారతీయ సామాజిక విలువలకు, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. సంగీత, సాహిత్యాలు ప్రధాన ఇతివృత్తంగా, మానవ సంబంధాల నడుమ నిత్యం తలెత్తే, వైరుధ్యాలను అత్యంత సృజనాత్మకంగా, సున్నితంగా దృశ్యమానం చేశారు. తెలుగు సినిమా ఉన్నన్ని రోజులూ కె. విశ్వనాథ్‌ పేరు నిలిచి ఉంటుంది. కవులు, పండితులకు జనన మరణాలుండవు అనే సూక్తి విశ్వనాథ్‌ గారికి అక్షరాలా వర్తిస్తుంది.

- తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు

విశ్వనాథ్‌గారి మరణం తీవ్ర విచారానికి గురిచేసింది. తెలుగు సంస్కృతికి, భారతీయ కళలకు నిలువుటద్దం విశ్వనాథ్‌గారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాలు తెలుగు సినీరంగానికి అసమాన గౌరవాన్ని తెచ్చాయి. వారు తెలుగువారి గుండెల్లో కళాతపస్విగా శాశ్వతంగా నిలిచిపోతారు.

- ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌

తెలుగు సినిమా స్థాయినీ, తెలుగు దర్శకుల సృజనాత్మకతనీ, ఉన్నత శిఖరాన ఉంచిన దర్శక స్రష్ట శ్రీ కె. విశ్వనాథ్‌ గారు. వారు శివైక్యం చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను.

- పవన్‌ కల్యాణ్‌

భారతదేశపు మేటి దర్శకుల్లో ఒకరు కె. విశ్వనాథ్‌. ఆయన ఇకలేరనే వార్త మనసును కలచివేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలి.

- ఇళయరాజా

నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన.. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి, తపస్సు కావించి, తనువు చాలించిన రుషికి అభివందనం. వెండితెరపై ఇక దొరకునా అటువంటి సేవ!

- కీరవాణి

నా సినీ ప్రయాణమే మహానుభావుడైన కె. విశ్వనాథ్‌గారితో ప్రారంభమైంది. ఆయనతో సినిమా చేస్తానంటేనే, మా తండ్రి ధర్మరాజుగారు, విశ్వనాథ్‌గారి క్రమశిక్షణ, అభిరుచిపైన నమ్మకంతో నన్ను మద్రాస్‌ పంపడానికి అంగీకరించారు. ఇప్పటికీ ఆ అనుభూతిని మర్చిపోలేను.

- అశ్వనీదత్‌ చలసాని

ప్రపంచంలో ఎవరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటి అని అడిగితే, మాకు కె. విశ్వనాథ్‌గారు ఉన్నారు అని రొమ్ము విరిచి గర్వంగా చెప్పుకుంటాం. తెలుగు సినిమాపైన మీ ముద్ర ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సినిమా గ్రామర్‌లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాంతం రుణపడి ఉంటాం సర్‌

- ఎస్‌. ఎస్‌ రాజమౌళి

మరో దిగ్గజాన్ని కోల్పోయాం. కె. విశ్వనాథ్‌గారి సినిమాలు, అందులోని పాత్రలు తెలుగు ప్రేక్షకుల మనస్సుల్లో పదికాలాలు నిలిచి ఉంటాయి. భవిష్యత్‌ తరాలు ఆయన ఘన వారసత్వాన్ని కొనసాగిస్తాయని ఆశిస్తున్నాను.

- నాగార్జున

బాక్సాఫీస్‌, స్టార్స్‌, వ్యక్తుల కన్నా సినీ పరిశ్రమ చాలా గొప్పది అని మనకు నేర్పారు. గ్రేటెస్ట్‌ కె. విశ్వనాథ్‌ గారు. మీ రుణం తీరిపోనిది. వీడుకోలు

- నాని

విశ్వనాథ్‌గారు ప్రతి సినిమా చివరిలో కళ కొనసాగుతుందంటారు. అలాగే ఆయన మరణం కూడా ముగింపు కాదు. ఆయన తాలూకు కళా వారసత్వానికి కొనసాగింపు అని అనుకుంటున్నాను.

- త్రివిక్రమ్‌

నటనలో నాకు ఎన్నో మెళకువలు నేర్పిన గురువు కె. విశ్వనాథ్‌కు వీడ్కోలు

- అనిల్‌కపూర్‌

విశ్వనాథ్‌గారు లేరనే వార్త భాధ కలిగించింది. దేశంలోని అత్యుత్తమ దర్శకుల్లో ఆయన ఒకరు. కళాతపస్వి మరణం యావత్‌ దేశానికే లోటు.

- వెంకటేశ్‌

పుట్టిన ప్రతివాడికీ మరణం తప్పదు. కానీ విశ్వనాథ్‌ గారి మరణం చాలా గొప్పది. భారతీయ చలనచిత్రాల్లో విరబూసిన కమలం కె. విశ్వనాథ్‌.

- బ్రహ్మానందం

కళాతపస్వి విశ్వనాథ్‌ కళ చిరస్థాయిగా నిలిచిపోతుంది. కళ అమరత్వాన్ని ఆయన పూర్తిగా అర్థం చేసుకున్న దిగ్గజ నటుడు. అందుకే ఆయన కళ చిరస్థాయిగా నిలిచిపోతుంది. నేను విశ్వనాథ్‌కు వీరాభిమానిని.

- కమల్‌ హాసన్‌

తాను నమ్మిన సినిమాను రాజీ పడకుండా తీసిన దర్శకుడు విశ్వనాథ్‌. విశ్వనాథ్‌ ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. తెలుగు సినిమాను ప్రపంచ వ్యాప్తం చేయడానికి విశ్వనాథ్‌ పునాది వేశారు.

- రాధికా శరత్‌కుమార్‌

నా గురువు, దిగ్గజ దర్శకుడు కె.విశ్వనాథ్‌ ఇకలేరన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నాను. ఆయన మృతి వార్త తెలిసి తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యాను. సిరిసిరిమువ్వకు ఆయనే నాకు మార్గనిర్దేశం చేశారు. పలు చిత్రాల్లో ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం లభించింది.

- జయప్రద

కె. విశ్వనాథ్‌ కేవలం గొప్ప దర్శకులు మాత్రమే కాదు. సూక్ష్మ నటనతో ఒక సంపూర్ణ నటుడని నిరూపించుకున్నారు. స్వాతిముత్యం, సాగరసంగమం, శంకరాభరణం చిత్రాల్లో వ్యక్తిగత అభిరుచులను చూపించారు. ఆ చిత్రాలను నేను 14 సార్లు చూశాను.

- విక్రమ్‌

Updated Date - 2023-02-04T04:55:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising