Pregnancy Test: మహిళలకు ఇది నిజంగా సూపర్ న్యూసే.. ఇకపై మూత్రంతో పరీక్ష అక్కర్లేకుండానే గర్భవతో కాదో తేల్చేయొచ్చు..!
ABN, First Publish Date - 2023-06-21T16:13:40+05:30
ఇది ఎప్పుడైనా, ఎక్కడైనా పరీక్షించేందుకు వీలున్న పరీక్ష కిట్.
ఒకప్పుడు ఆడవారు గర్భంతో ఉన్నదనేది డార్టర్స్ చెబితేనే తెలుస్తుండేది. లేదా నెలసరి దాటినా లక్కల ప్రకారం గర్భంతో ఉన్నది నిర్థారించుకునేవారు. తరవాత డాక్టర్ తగ్గరకు వెళ్లేవారు. అయితే మూత్ర పరీక్షతోనే ఇంట్లోనే గర్భంతో ఉన్నదీ లేనిదీ తెలిసే సౌకర్యం వచ్చాకా చాలామంది ముందుగా ఇంట్లో మూత్రపరీక్ష చేసుకుని నిర్థారించుకున్నాకా డాక్టర్ దగ్గరకు వెళుతున్నారు. అయితే ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ మరింత ముందుకు వెళ్లి మూత్ర పరీక్ష కూడా లేకుండానే గర్భాన్ని ముందుగానే తెలుసుకునే వీలుందని తెలిపింది అదేలాగంటే..
మహిళల గర్భాన్ని గుర్తించడంలో భారీ పరిశోధన విజయవంతమైంది. ఇప్పుడు కొత్త ప్రెగ్నెన్సీ కిట్ కనుగొన్నారు. దీని ద్వారా మహిళలు గర్భవతిగా ఉన్నారో లేదో వారి లాలాజలం ద్వారానే చెప్పేయచ్చట. ప్రస్తుతం ఈ ఉత్పత్తి UK మార్కెట్‌లోకి వచ్చింది. కేవలం 'Spit test'తో గర్భధారణను గుర్తించగల ప్రపంచంలోని మొట్టమొదటి ఉత్పత్తి ఇది. ఇది మూత్ర ఆధారిత గర్భధారణ పరీక్షలకుగొప్ప ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి వచ్చింది.
'Spit test తో కూడిన ఈ ప్రెగ్నెన్సీ కిట్ ఎక్కడ అందుబాటులో ఉంది?
ఈ 'స్పిట్ టెస్ట్' ఆధారిత ప్రెగ్నెన్సీ కిట్ ప్రస్తుతం UK, ఐర్లాండ్‌లో అందుబాటులో ఉంది. పరీక్ష కిట్‌ను జెరూసలేంకు చెందిన స్టార్టప్ సాలిడియాగ్నోస్టిక్స్ అభివృద్ధి చేసింది. ఇది కోవిడ్ టెస్టింగ్ కిట్‌ల తయారీకి ఉపయోగించే సాంకేతికతపై ఆధారపడి ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది. దీనిని ఎప్పుడైనా, ఎక్కడైనా పరీక్షించేందుకు వీలున్న పరీక్ష కిట్.
ఇది కూడా చదవండి: అస్సలు ఏడవకపోయినా ఇబ్బందేనట.. సంతోషంగా ఉండటం మంచిదే కానీ.. కన్నీళ్లు ఒక్కసారి కూడా రాకపోతే..!
కొత్త ప్రెగ్నెన్సీ కిట్‌ని ఎలా ఉపయోగించాలి.
ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవాలనుకుంటే స్త్రీ తన నోటిలో కిట్లోని పొడవాటి స్ట్రాను థర్మామీటర్ లాగా కొన్ని క్షణాల పాటు తన నోటిలో ఉంచుకోవాలి. ఈ కిట్ లాలాజలం నమూనాను సేకరిస్తుంది. స్ట్రా నోటిలోని తేమను ప్లాస్టిక్ ట్యూబ్‌కి బదిలీ చేస్తుంది, అక్కడ జీవరసాయన ప్రతిచర్య జరుగుతుంది. దీని ద్వారా ఆమె గర్భంతో ఉన్నదీ లేనిదీ ఇట్టే చెప్పేయవచ్చు.
ఈ హార్మోన్ ద్వారా గర్భం గుర్తించబడుతుంది.
ఇది hCGని గుర్తించే కొత్త టెస్ట్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. hCG అనేది గర్భధారణ నిర్దిష్ట హార్మోన్, ఇది పిండం అభివృద్ధి కోసం గర్భాశయాన్ని సిద్ధం చేయడంలో సహాయపడుతుంది. దీని ద్వారా ఫలితాలను ఐదు నుండి 15 నిమిషాలలోపు చూడవచ్చు, కేవలం మూడు నిమిషాల్లోనే కనిపిస్తాయి అని కంపెనీ చెబుతోంది.
Updated Date - 2023-06-21T16:13:40+05:30 IST