Health Facts: అన్నం తిన్న వెంటనే పొరపాటున కూడా ఈ 5 పనులు చేయకండి.. లాభాల కంటే నష్టాలే ఎక్కువండోయ్..!
ABN, First Publish Date - 2023-09-14T12:57:14+05:30
ఆహార కణాలు, దంతాల మీద వాటి మధ్య ఖాళీలలో ఉన్నప్పుడు, పళ్ళు పాడవుడం, చిగుళ్ళ వ్యాధి వచ్చే విధంగా చేస్తుంది.
ఆహారం తిన్న తర్వాత చాలామందిలో చూసే అలవాట్లే అయితే కొన్ని చేయకూడని పనులను చేసేస్తూ ఇబ్బంది పడుతూ ఉంటాం. అసలు అన్నం తిన్న వెంటనే పొరపాటున చేస్తున్న పనులు, వాటితో కలిగే లాభ, నష్టాలేంటనే విషయాన్ని ఆలోచించి ఉండం. మామూలుగా ఆహారం తిన్న తర్వాత ఒక కప్పు టీ తాగడం సహజం. మనలో చాలా మంది ఇలా అనుకుంటారు, కానీ ఇది మానుకోవడం మంచిది. ఇది కడుపుకు చేటు చేస్తుంది.
చెడు అలవాట్లు..
ఆహారం తిన్న వెంటనే, మనం కొన్ని చెడు అలవాట్లను ప్రోత్సహిస్తూ ఉంటాము, దీని కారణంగా మన బరువు పెరగడమే. ఇది జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భోజనం చేసిన తర్వాత కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం ద్వారా, మంచి జీర్ణక్రియను పొందవచ్చు. అలాగే ఊబకాయం వంటి వాటిని నియంత్రించవచ్చు.
కెఫిన్ తీసుకోవడం
టీ, కాఫీని భోజనం చేసిన 1 గంట తర్వాత మాత్రమే తీసుకోవాలి. ఇవి పోషకాల శోషణకు ఆటంకం కలిగిస్తాయి.
నీరు ఎక్కువగా త్రాగుటం
తిన్న వెంటనే అధిక మొత్తంలో నీరు త్రాగడం వల్ల కడుపులోని ఆమ్లం పలుచన అవుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
తిన్న తర్వాత వ్యాయామం చేయడం
తిన్న వెంటనే ఎటువంటి తీవ్రమైన శారీరక శ్రమ చేయకూడదు, ఎందుకంటే శరీరం జీర్ణ అవయవాలకు బదులుగా వ్యాయామం కోసం ఉపయోగించే కండరాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఇది కడుపులో అసౌకర్యం, తిమ్మిరి, బద్ధకం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: ఆస్పత్రికి వెళ్లి టెస్టులు చేయించుకోకుండానే.. కేన్సర్ ఉందని గుర్తించడం ఎలాగంటే..!
పళ్ళు తోముకోవడం..
తిన్న తర్వాత దంతాలను శుభ్రం చేయకపోతే, అది దంతాలు, చిగుళ్ళకు హానికరం. ఆహార కణాలు, దంతాల మీద వాటి మధ్య ఖాళీలలో ఉన్నప్పుడు, పళ్ళు పాడవుడం, చిగుళ్ళ వ్యాధి వచ్చే విధంగా చేస్తుంది.
తిన్న వెంటనే పడుకోవడం
తిన్న వెంటనే పడుకోవడం గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్‌కు కారణమవుతుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియకు అంతరాయం కలిగించవచ్చు. ఆహారం తీసుకున్న కనీసం రెండు నుండి మూడు గంటల తర్వాత పడుకోవాలి.
Updated Date - 2023-09-14T12:57:14+05:30 IST