ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Healthy Hair: జుట్టు గురించి కంగారు పడి ఎన్నో మెడిసిన్స్ వాడి ఉంటారు.. కానీ రూ.10 పెట్టి వీటిని కొని.. ఒక్కసారి ట్రై చేసి చూస్తే..!

ABN, First Publish Date - 2023-09-22T17:18:43+05:30

ఈ రసాన్ని జుట్టు మూలాలకు పట్టించి మసాజ్ చేయాలి. కనీసం ఒక గంట పాటు జుట్టు కడగవద్దు.

twice a week

స్త్రీ అందాన్ని పెంచడంలో కేశాలు కూడా ముఖ్యమైన భాగం పోషిస్తాయి. జుట్టు ఎంత ఒత్తుగా అందంగా ఉంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. పెరుగుతున్న కాలుష్యం కారణంగా జుట్టు పలుచగా మారడం, ఊడిపోవడం ఇప్పుడు అందరిలో కనిపిస్తున్న అది పెద్ద సమస్య. అయితే దీనికి పరిష్కారాలను వెదకడంలో చాలా ఖర్చుచేస్తూ ఉంటారు స్త్రీలు. రాలిపోవడం, పలుచగా మారడంతో పాటు వెంట్రుకలు నిర్జీవంగా మారి, తెల్లబడటం కూడా పెద్ద సమస్యే. మామూలుగా ప్రతి స్త్రీ ఒక ముఖ్యమైన విషయాన్ని మరచిపోతుంది, జుట్టు షైన్, మృదువుగా , నల్లగా, మందంగా, పొడవుగా ఉండాలి, అనుకుంటారు కానీ అది పొడిగా, నిర్జీవంగా ఉంటే, పెద్దగా పట్టించుకోరు. సమస్య ఇక్కడి నుంచే మొదలవుతుంది. అటువంటి పొడి జుట్టు సులభంగా స్టైల్ చేయలేం. జుట్టు పొడిబారడానికి మార్కెట్ లో దొరికే ఉత్పత్తులలోని రసాయనాల వల్ల కలిగే నష్టం కూడా ఎక్కువే. అలాగే వెంట్రుకలకు వచ్చే మెరుపు తాత్కాలికంగా ఉండకూడదు, జుట్టు పొడవుగా, నల్లగా, ఒత్తుగా ఉన్నంత కాలం ఆ మెరుపు, ఆ జీవం అందులో చెక్కుచెదరకుండా ఉండాలి. అదెలాగంటే..

దీనికి వేల రూపాయలు అవసరం లేదు. కేవలం పది రూపాయలు ఖర్చు చేయడం ద్వారా, జుట్టుకు కొత్త జీవితాన్నిఇవ్వవచ్చు. దీనికి మనం తరచుగా సలాడ్‌లో తింటూ ఉంటాం, దీని రసాన్ని తీసి ముఖం మీద రాసుకుంటూ ఉంటారు అదే కీరదోస, ముఖానికే కాదు ఇది జుట్టుకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మెరిసే జుట్టుకు కొత్త జీవం పోయాలంటే మార్కెట్ నుంచి పది రూపాయల కీరా కొంటే చాలు. కీరదోసకాయను మెత్తగా తురిమి, దాని రసాన్ని పిండాలి. ఈ రసంలో అలోవెరా జెల్ కలపండి, నిమ్మరసం, ఆపిల్ సైడర్ వెనిగర్ కూడా కలపండి.

వీటన్నింటినీ ఒక చెంచా సహాయంతో బాగా కలపండి.

ఇప్పుడు ఈ జ్యూస్ జుట్టు మీద అప్లై చేయండి. ఈ రసాన్ని జుట్టు మూలాలకు పట్టించి మసాజ్ చేయాలి. కనీసం ఒక గంట పాటు జుట్టు కడగవద్దు. దీని తరువాత, గోరువెచ్చని నీటితో జుట్టును సున్నితంగా కడగాలి. ఈ రసాన్ని జుట్టుకు కనీసం వారానికి రెండు సార్లు అప్లై చేయండి.

ఇది కూడా చదవండి: మహిళలూ బీ అలెర్ట్.. శరీరంలోని ఈ భాగాల్లోనే కేన్సర్ రిస్క్ ఎక్కువ.. ముందే గుర్తిస్తే..!

కీర దోసకాయ రసం ప్రయోజనాలు

దోసకాయ రసం జుట్టుకు చాలా మేలు చేస్తుంది. కీర దోసకాయ శిరోజాలను హైడ్రేట్ చేస్తుంది. అదనంగా, ఇందులో ఉండే విటమిన్-ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్-సి జుట్టుకు పోషణనిస్తాయి. ఇలా చేయడం వల్ల జుట్టుకు కొత్త మెరుపు రావడంతో పాటు శిరోజాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు కూడా మరింత హైడ్రేటెడ్ అవుతుంది, ఇది వాటిని మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. హెయిర్ మాస్క్ నిర్జీవమైన జుట్టుకు కొత్త పోషణను ఇస్తుంది.

Updated Date - 2023-09-22T17:18:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising