Carrot And White Radish: క్యారెట్, తెలుపు ముల్లంగి శరీరంలో అదనపు కొవ్వును తొలగించడంలో ఏది సహాయపడుతుంది?
ABN, First Publish Date - 2023-02-20T11:20:23+05:30
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, క్యారెట్ తినడం వలన వీలైనంత త్వరగా బరువు తగ్గవచ్చు.
ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం. వారంలో కనీసం ఒకసారైనా పచ్చి కూరగాయలు, కూరగాయల జ్యూస్ తీసుకోవడం వల్ల అవి శరీరంలోని అదనపు కొవ్వును తొలగించడంలో సహాయపడతాయి. అందుకే నిపుణులు డిటాక్స్ డైట్‌పై కూడా ఆలోచించమంటున్నారు. క్యారెట్, తెల్ల ముల్లంగి కలిపి తీసుకోవడం వల్ల అది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనికి కావలసిన పదార్థాలు, తయారుచేసే విధానం గురించి తెలుసుకుందాం.
కావలసినవి
½ కప్పు - తురిమిన క్యారెట్
½ కప్పు - తురిమిన డైకాన్ (తెల్ల ముల్లంగి)
1½ కప్పు - నీరు
తీసుకునే పద్దతి..
* క్యారెట్, డైకోన్ (తెల్ల ముల్లంగి) నీళ్లలో ఉడకబెట్టండి.
* 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి.
*ఈ ముక్కలను, తిని పులుసు త్రాగాలి.
ఇలా 10 రోజులు సేవించండి, మూడు రోజులు విరామం తీసుకోండి, ఆపై అదే పద్దతిలో ఒక నెల పాటు చేయండి. ఇది అదనపు కొవ్వును తొలగించడానికి అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.
కొవ్వును తగ్గించడంలో ఎలా సహాయపడుతుంది?
1. డిటాక్సిఫైయర్: దీని ఘాటైన రుచి కాలేయానికి పని చేస్తుంది. ఏదైనా అదనపు కొవ్వనును తొలగించేలా ప్రేరేపిస్తుంది. అందుకే జపనీయులు దీనిని టెంపురా (డీప్ ఫ్రైడ్)తో కలిపి తింటారు.
2. ముల్లంగి యిన్, యాంగ్ లక్షణాలతో కూడిన సమతుల్య రూట్ వెజిటేబుల్, రక్తంలో విషాన్ని కూడా తొలగిస్తుంది, కాబట్టి ఇది చర్మంపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
3. విటమిన్ సి: అర కప్పు క్యారెట్, ముల్లంగి రసాన్ని తీసుకుంటే ఇందులోని విటమిన్ సి 155 శాతం ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది.
4. జీర్ణవ్యవస్థ: ముల్లంగిలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున జీర్ణవ్యవస్థను ఎక్కువ ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఇది శక్తివంతమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది.
5. బరువు తగ్గడం: ఇది జీర్ణవ్యవస్థపై పెద్ద ప్రభావాన్ని చూపి, బరువు తగ్గడానికి దారితీస్తుంది.
ఇది నిజంగా ప్రభావవంతంగా పనిచేస్తుందా?
క్యారెట్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. క్యారెట్‌లో, సహజంగా తక్కువ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండటం వలన బరువు తగ్గించే ప్రయత్నాలలో సహాయం చేస్తుంది. ఒక గ్లాసు పచ్చి క్యారెట్‌లో 50 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఆరోగ్యకరమైన మార్గంలో బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే, క్యారెట్ తినడం వలన వీలైనంత త్వరగా బరువు తగ్గవచ్చు. ఉడకబెట్టిన క్యారెట్లలో, గ్లాసుకు 54 కేలరీలుంటాయి. అలాగే, క్యారెట్‌లు విటమిన్‌లతో నిండి ఉంటాయి, ముఖ్యంగా విటమిన్ A. మన శరీరం విటమిన్ A ని ఆహారం నుండి రెటినోయిడ్స్ అని పిలిచే రసాయనాలుగా మారుస్తుంది, ఇది మన కొవ్వు కణాలతో సంకర్షణ చెందుతుంది. ఇది కొత్త కొవ్వు కణాల పెరుగుదల, కొవ్వు నిల్వ , ఊబకాయాన్ని ప్రభావితం చేస్తుంది.
Updated Date - 2023-02-20T11:20:25+05:30 IST